ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలోకి కొత్త హీరోయిన్లు బాగానే ఇంట్రడ్యూస్ అవుతున్నారు. అదృష్టం కలిసి వస్తే..ఛాన్సులు వరుసగా కలిసి వస్తున్నా..కొంత మందికి మాత్రం బ్యాడ్ లక్ తో కంటికి కనిపించకుండా పోతున్నారు. ఇక ఒక్క చిత్రంతోనే తెలుగులోనే కాదు తమిళంలోకూడా వరుస ఛాన్స్ లు కొట్టేసిని హీరోయిన్లు కీర్తి సురేష్, సాయి పల్లవి. ఇక జపతిబాబు .. నారా రోహిత్ ప్రధాన పాత్రధారులుగా, పరుచూరి మురళి దర్శకత్వంలో 'ఆటగాళ్లు' చిత్రం రూపొందింది. ఈ చిత్రంలో కథానాయికగా దర్శన బానిక్ తెలుగు తెరకి పరిచయమవుతోంది.
సాయి కార్తీక్ బాణీలు అందిస్తున్నారు. ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ పతాకంపై వాసిరెడ్డి రవీంద్ర నాథ్, వాసిరెడ్డి శివాజీ ప్రసాద్, మక్కెన రాము, వడ్లపూడి జితేంద్ర సినిమాను నిర్మిస్తున్నారు. ఆగస్టు 24న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దర్శన బానిక్ మాట్లాడుతూ...మాది కోల్ కొతా..నేను అక్కడ మోడల్ గా రాణించాను. అంతే కాదు బెంగాళీ చిత్రాల్లో నటించాను..ఆ మద్య ఓ బెంగాలీ వెబ్ సీరీస్ లో కూడా నటించాను..నాకు ఇండస్ట్రీలో కొత్త కాదు కానీ తెలుగు లో నటించడం ఇదే ప్రధమం.
నేను గత ఏడాది ఓ మ్యూజిక్ వీడియోలో నటించాను ఆ వీడియో కొరియోగ్రాఫర్ విష్ణు దేవా నా ఫొటో షూట్ స్టిల్స్‌ను ఈ చిత్ర దర్శక, నిర్మాతలకి పంపారు. వారు వెంటనే ఆడిషన్ కి రమ్మనగానే నేను వెళ్లాను..కొన్ని సీన్లు షూట్ చేసిన తర్వాత ఆ సినిమాకు సెట్ అవుతానని నన్ను తీసుకున్నారు. ఈ చిత్రంలో నా పాత్ర పేరు అంజలి..స్వతంత్ర భావాలు..ధైర్యసాహసాలు ఉన్న అమ్మాయిగా నటించానని అన్నారు.
తెలుగు చిత్రాలు బెంగాళీలో అనువాదం అవుతుంటాయి.. ‘మగధీర’, ‘ఆర్య’, ‘ధృవ’, ‘అరుంధతి’, ‘బాహుబలి’ సిరీస్ చూశాను..నాకు బాహుబలి లో నటించిన ప్రబాస్ అంటే ఎంతో ఇష్టం అని అంటుంది ఈ బెంగాళీ భామ. మరి తెలుగు లో మంచి హిట్ సాధించి ఇక్కడ కూడా తన సత్తా కొనసాగిస్తుందో లేదో చూడాలి.