సినీ రంగంలోకి బాలనటిగా వచ్చిన శ్వేతాబసు తర్వాత హీరోయిన్ గా మారింది.  మొదట దురదర్శిని ధారావాహికలలో బాలనటిగా తన కెరీర్  ప్రారంభించిన ఆమె బెంగాలీ, తెలుగు, తమిళ సినిమాల్లో హీరోయిన్, సైడ్ హీరోయిన్ గా నటించింది. 2002 మూవీ మక్దీలో ఆమె నటనకు, ఉత్తమ బాల నటిగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని గెలుచుకుంది. 2008 లో కోత్త బంగారు లోకం మూవీతో శ్వేత తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టింది. శ్వేత ‘కొత్త బంగారు లోకం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు నటిగా పరిచయమయ్యారు. తర్వాత ‘కాస్కో’, ‘రైడ్‌’, ‘కళావర్‌ కింగ్‌’ తదితర సినిమాల్లో నటించారు. తెలుగులోనే కాకుండా తమిళంలోనూ పలు సినిమాల్లో సందడి చేశారు. ప్రస్తుతం ఆమె పలు టీవీ సీరియల్స్‌లో నటిస్తున్నారు.  

 

అప్పట్లో ఓ వ్యభిచారం కేసులో ఇక్కున్న తర్వాత శ్వేతా బసు తెలుగు లోకల్ మీడియా నుండి జాతీయ మీడియా వరకు హాట్ టాపిక్ అయింది. ఈ కేసులో కొంత కాలంగా పాటు నిర్భంధంలో ఉండాల్సి పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి తానే ఏ నేరం చేయలేదని కోర్టు నుండి క్లీన్ చిట్ వచ్చిన తర్వాత విడుదలైంది.  గత ఏడాది తాను ప్రేమించిన ప్రియుడు ఫిల్మ్‌మేకర్‌ రోహిత్‌ మిట్టల్‌ను పెళ్లి చేసుకుంది.  పెద్దల సమక్షంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. మార్వాడీ, బెంగాలీ సంప్రదాయాల ప్రకారం రెండు సార్లు వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం. తాజాగా పెళ్లైన ఏడాదికే  శ్వేతా బసు ప్రసాద్ విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.

 

తమ వైవాహిక బంధానికి ఫుల్‌స్టాప్‌ పెట్టాలని తాను తన భర్త రోహిత్ మిట్టల్ కొన్ని రోజుల క్రితమే నిర్ణయించుకున్నట్టు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కు ముందు వరకు మా ప్రయాణం సంతోషంగా సాగింది. కానీ ఇప్పుడు అపార్థాలు చోటు చేసుకున్నాయి. అయినా ఒక పుస్తకం చదువుదామని కొంటాం.. దాన్ని చివరి పేజీ వరకు చదవాలని రూలేం లేదు కదా.. ఇష్టమైతే చదువుతాం లేకపోతే లేదు.. చదవనంత మాత్రాన అదేం చెడ్డ పుస్తకం కాదు. కొన్ని విషయాలు తెలుసుకోకుండా ఉంటేనే మంచిది. నాకు స్ఫూర్తిగా ఉంటూ.. ఎన్నో జ్ఞాపకాలు అందించిన రోహిత్‌కు థ్యాంక్యూ అంటూ పోస్ట్ పెట్టారు. కొన్ని నెలలుగా తమ మధ్య విభేదాల కారణంగా విడాకులు తీసుకోబోతున్నట్టు స్పష్టం చేశారు. ఈ విషయాన్ని తన అభిమానులతో పంచుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: