ఇటివలే పదేళ్ల కెరీర్ ను విజయవంతంగా పూర్తి చేసుకుంది సమంత. గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న సమంత కెరీర్లో హిట్లతో పాటు ఏ హీరోయిన్ కు లేనన్ని ఇండస్ట్రీ హిట్ లు ఉండటం విశేషం. టాలీవుడ్ లో ప్రభాస్ తో తప్ప ఈ జనరేషన్ లోని టాప్ స్టార్స్ అందరితో నటించింది సమంత. దాదాపుగా  టాలీవుడ్ లో కొన్నాళ్లు నెంబర్ వన్ హీరోయిన్ గా వెలిగింది. పెళ్లయ్యాక చేసిన రంగస్థలం ఇండస్ట్రీ హిట్ గా నిలవడం ఆమెకు మరింత పేరు తెచ్చిపెట్టింది. పెళ్లి తర్వాత సెలక్టివ్ గా సినిమాలు చేస్తోంది సమంత.

 

 

ప్రస్తుతం ఆమె డైరీలో తమిళ సినిమాలు తప్ప తెలుగు సినిమాలు లేవు. త్రివిక్రమ్ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న మూవీలో సమంత పేరు వినిపిస్తోంది కానీ అఫిషియల్ క్లారిటీ మాత్రం లేదు. కానీ తమిళ్ లో రెండు సినిమాలకు సైన్ చేసింది., దీంతో ఆమె తెలుగుకు ప్రియారిటీ తగ్గించిందా.. లేదంటే తనకు నచ్చిన సబ్జెక్టులు తెలుగులో రావడం లేదా అనే వార్తలు వస్తున్నాయి. తమిళ్ లో విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో నయనతారతో పాటు కలిసి ఓ సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు అశ్విన్ శరవణన్ అనే దర్శకుడు చెప్పిన కథకు ఓకే చెప్పింది. హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో ఆ సినిమా ఉంటుందని సమాచారం.

 

 

ప్రస్తుతం తెలుగులో రష్మిక మందన, పూజ హెగ్డేల పేర్లు తప్ప మిగిలిన హీరోయిన్ల పేర్లు వినిపించే పరిస్థితి కనిపించడం లేదు. స్టార్ హీరోలకు మెయిన్ చాయిస్ లా మారారు వీరిద్దరూ. దీంతో సమంత చేయాలంటే స్టార్ హీరోలయ్యుండాలి.. లేదంటే ఓబేబి లాంటి దమ్మున్న సబ్జెక్టు ఉండాల్సిందే. మరి ఈ కారణమే సమంత తెలుగు సినిమాలకు సైన్ చేయకపోవడానికి కారణమా అని గుసగుసలు వినిపిస్తున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: