టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సావిత్రిని మహానటి అని పిలిచేవారు. అప్పట్లో అమితాబచ్చన్ సావిత్రి నటన కి ఫిదా అయిపోయి... అత్యంత సహజంగా గొప్పగా నటించే అతి తక్కువ మంది నటులలో సావిత్రి ఒకరని బాగా కొనియాడాడు. సినీ రంగ ప్రవేశం చేసిన కొన్ని నెలలోనే సావిత్రి పాపులారిటీ నలుదిశలా వ్యాపించింది. దేవదాసు, అర్ధాంగి, మాయాబజార్ వంటి చిత్రాలను చూస్తే ఆమె ఎంత గొప్ప నటీమణో ఇట్టే అర్థమవుతుంది. ఆమెకు జ్ఞాపకశక్తి బాగా ఉండటం వలన ఎంతటి డైలాగు నేనా క్షణాల్లో చదివి నిమిషాల్లో గుర్తు పెట్టుకుంటుంది. ఇతర నటుల లాగా ఆమె రిహార్సల్స్ అవసరం లేకుండానే నేరుగా ఓకే షాట్ కి సూపర్ గా నటించేదట. జెమినీ గణేషన్ వివాహమాడిన తర్వాత అతను ఆర్థిక లావాదేవీలు తెలియని అమాయకురాలు సావిత్రి ని మోసం చేస్తూ డబ్బులన్నీ దన్నుకున్నాడు. ఆ సమయంలోనే ఆమె మూగమనసులు సినిమాని తమిళంలో నిర్మించింది. కానీ తమిళ ప్రేక్షకులు ఆ సినిమాని ఆదరించకపోయేసరికి ఆమె ఆ సినిమాపై పెట్టుబడి గా పెట్టిన డబ్బులన్నీ పోయాయి. 


సావిత్రి ఇష్టారాజ్యంగా సొంత నిర్ణయాలు తీసుకుంటూ సినిమాలు నిర్మిస్తుందన్న కోపంతో జెమినీ గణేషన్ ఆమెతో మాట్లాడకుండా ఉండేవాడు. ఒకవైపు ఆచంట మరోవైపు భర్త మాట్లాడకపోవడం ఆమెపై విపరీతంగా ప్రభావం చూపాయి. బాధలను మరచిపోయేందుకు సావిత్రి పొద్దస్తమానం ఆల్కహాల్ పుచ్చుకునేది. ఒకవైపు మత్తులో ఉండడం మరోవైపు ఆర్థిక లావాదేవీలు తెలియకపోవడంతో ప్రతి ఒక్కరు ఆమె నుండి డబ్బులను దోచేసుకునేవారు. ఆ విధంగా ఆమె దగ్గర ఉన్న డబ్బులు అన్నీ కొల్లగొట్టారు. పన్ను కట్టలేదని ఇన్కమ్ టాక్స్ వారు ఆమె ఇంటికి వచ్చి ఆస్తులను జప్తు చేయగా ఆమె రోడ్డునపడ్డది. 


దాంతో తిండి, గుడ్డ కోసం మళ్లీ ఆమె మొహానికి రంగు పూసుకొని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవతారమెత్తింది. అప్పటికే ఆమెకు షుగర్ బీపీ వంటి వ్యాధులు రావడం తో శారీరకంగా క్షీణించి చాలా దీనంగా కనిపించింది. దీంతో ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. 1975లో రామకృష్ణ, వాణిశ్రీ హీరో హీరోయిన్లుగా నటించిన పూజ సినిమా లో హీరో కి తల్లి పాత్రలో సావిత్రి నటించింది. దాసరి నారాయణరావు ఆమె పరిస్థితిని అర్థం చేసుకుని గోరింటాకు సినిమాలో ఆమెకు ఒక ఛాన్స్ ఇచ్చాడు. అలాగే దేవదాసు మళ్లీ పుట్టాడు అనే చిత్రం కేవలం సావిత్రి కోసమే తెరకెక్కించాడు. తదనంతరం అనేకమైన సినిమాల్లో తల్లి అక్క పిన్ని వంటి క్యారెక్టర్స్ లో నటించింది సావిత్రి. 


ఆ క్రమంలోనే కన్నడ చిత్రం యొక్క షూటింగ్ నిమిత్తం బెంగళూరు వెళ్లిన ఆమెకు తన ఆస్తులన్నీ జప్తు చేయబడ్డాయి అని తెలిసింది. దాంతో ఆమె ఒక్కసారిగా కృంగిపోయి మళ్లీ మందు పుచ్చుకోవడం ప్రారంభించింది. ఒకానొక రోజు ఇన్సులిన్ వేసుకొని ఏమి ఆహారం తీసుకోకపోవడంతో కోమా లోకి వెళ్ళింది. అప్పటికే ఆమె ఎముకల గూడులా తయారయింది. చివరి దశలో సన్నిహితులు ఆమెకు నోటి ద్వారా ఆహారాన్ని అందించాలని ఎంత ప్రయత్నించినా తినలేకపోయింది. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఆమె 45 సంవత్సరాలకే ఘోరాతి ఘోరంగా చనిపోయి అందరిని కంటతడి పెట్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: