టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారక్టర్ ఆర్టిస్ట్ లకు మంచి పేరు ఉందన్న విషయం తెలిసిందే.. అందుకే సినిమాలో నటించే హీరో, హీరోయిన్ల కన్నా కూడా క్యారక్టర్ ఆర్టిస్టులు ఎక్కువ పాపులర్ అవుతున్నారు.తెలుగు చిత్ర పరిశ్రమలో అలా నటించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న నటీ నటులు ఎందరో ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే తండ్రి పాత్రలో నటించి మెప్పించిన ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు.. వారు ఎవరు, వారికి అంతగా గుర్తింపు ఎందుకు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.. 

IHG

ప్రకాష్ రాజ్.. ఈ పేరు అందరికీ తెలిసిన పేరే.. తెలుగు చిత్రాలలో ఎన్నో విభిన్న పాత్రల్లో నటించి మెప్పించారు.. ఏ పాత్ర లో నటించిన ఆ పాత్రలో జీవించి నటించడం ఆయన స్పెషల్ అలాంటి ప్రకాష్ రాజ్ ఎక్కువగా హీరోయిన్ తండ్రి గానో , లేక హీరో తండ్రిగానో నటించి ఆ పాత్ర ఆయనకు తప్ప వేరేవారికి సెట్ అవ్వదు అనేలా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. ఇప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ వస్తున్నారు. 

IHG's favourite <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=READ' target='_blank' title='read-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>read</a> ...

 

నాజర్.. తెలుగు సినిమాలలో ఈయన పేరుకు కూడా చాలా ప్రత్యేకత ఉంది..విభిన్న పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. తండ్రిగా ఈయన చేసిన సినిమాలు కూడా మంచి హిట్ ని అందుకున్నాయి.. ఇటీవల ఈయన నటించిన బాహుబలి ప్రపంచ స్థాయి రికార్డులను అందుకుంది.. నటనలో ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ వరుస సినిమాలలో నటిస్తున్నారు.

IHG

 

షియాజి షిండే.. ఈయన తెలుగు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. విలన్ గా , తండ్రిగా , అన్నగా ఈయన చేసిన సినిమాలు విజయాలను అందుకున్నాయి.. ఇప్పటికీ ఆయన అదే జోష్ తో వరుస సినిమాలలో నటిస్తున్నారు..

 

రావు రమేష్, ఆహుతి ప్రసాద్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఇలా చాలా మంది తండ్రి పాత్రలలో నటించి మెప్పించారు..

మరింత సమాచారం తెలుసుకోండి: