మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలనేదే ఏ డైరక్ట్ కలైనా. అ అవకాశం వస్తే పండగలా ఫీల్ అవుతారు. యువ దర్శకుడు సుజిత్ పరిస్థితి కూడా ఇంతే. మళయాళ మూవీ లుసిఫర్ తెలుగు రీమేక్ సుజిత్ చేతికి వెళ్లింది. దీనిపై సుజిత్ వర్క్ చేశాడని కూడా వార్తలు వచ్చాయి. కానీ.. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ సుజిత్ చేయడం లేదని తెలుస్తోంది. మెగాస్టార్ తో రెండు వరుస హిట్లు ఇచ్చిన దర్శకుడికి ఈ అవకాశం వెళ్లిందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్ అవుతోంది.

IHG's all you need to know about <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=CHIRANJEEVI' target='_blank' title='megastar-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>megastar</a> Chiranjeevi's 150th film

 

ఈ వార్తపై మెగా క్యాంప్ నుంచి అఫిషియల్ న్యూస్ లేదు. కానీ.. దీనిపై అనేక వార్తలు రౌండ్ అవుతున్నాయి. చిరంజీవి ఈ సినిమాను హోల్డ్ లో పెట్టినట్టు ఒక వార్త రౌండ్ అయితే.. మరో స్టార్ దర్శకుడి చేతిలో ఈ సినిమా పెట్టినట్టు మరో వార్త రౌండ్ అవుతున్నాయి. దీంతో లుసిఫర్ రీమేక్ పై గాసిప్స్ ఎక్కువైపోయాయి. దీంతోపాటు మరో వార్త కూడా రౌండ్ అవుతోంది. సుజిత్ కు చిరంజీవి సినిమా మిస్ అయినట్టేనని.. తన ఓన్ స్క్రిప్ట్ తో మరో సినిమా పెద్ద బ్యానర్లో ఓకే అయిందని కూడా వార్తలు వస్తున్నాయి. ఇద్దరు హీరోలు ఈ సినిమాలో నటించనున్నారని కూడా అంటున్నారు.

IHG

 

ప్రస్తుతానికి ఇవన్నీ గాసిప్స్ గా ఇండస్ట్రీలో రౌండ్ అవుతున్నాయి. వీటన్నింటిపై సుజిత్ గానీ, మెగా కాంపౌండ్ గానీ అఫిషియల్ క్లారిటీ రావాల్సిందే. రన్ రాజా రన్ తో హిట్ కొట్టిన సుజిత్ రెండో సినిమానే ప్రభాస్ తో పాన్ ఇండియన్ సినిమా సాహో చేశాడు. తెలుగులో ఫ్లాప్ అయినా నార్త్ లో మంచి కలెక్షన్లు రాబట్టింది. దీంతో భారీ సినిమా హ్యండిల్ చేసే సత్తా తనకు ఉందని ప్రూవ్ చేసుకున్నాడు సుజిత్.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: