మాధవీలత నచ్చావులే సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యింది. తర్వాత చిన్న క్యారెక్టర్ లు చేసుకుంటూ గుర్తింపు తెచ్చుకుంది. అప్పుడు కాస్టింగ్ కౌచ్ గురించి కొన్ని వివాదస్పదమైన కామెంట్లు చేసి వార్తల్లో నిలిచింది. రీసెంట్ గా ఆత్మ హత్య చేసుకుంటున్నానంటూ ఆమె చేసిన వార్తలు అయితే పెద్ద దూమారాన్నే రేపాయి. అప్పుడోసారి పవన్ మీద శ్రీ రెడ్డి చేసిన వార్తలపై స్పందించి వివాదాల్లో నిలిచింది మాధవీలత.
ఇక పోతే పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ‘వకీల్ సాబ్’ మోషన్ పోస్టర్ విడుదలైంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ తాళ్లూరి ఒక సినిమా ప్రకటించారు. సెలబ్రిటీలు బర్త్ డే విషెస్‌తో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. అభిమానుల హంగామాకు అయితే లెక్కలేదు. వీటిమధ్య ఒక చిన్న సినిమా పోస్టర్ పవర్ స్టార్ అభిమానులను ఆకర్షిస్తోంది. మాధవీలత ప్రధానపాత్రలో రూపొందుతోన్న ఒక సినిమా ‘సత్యాగ్రహి’. కృష్ణచైతన్య దర్శకత్వంలో శ్రీ భవిత క్రియేషన్స్ పతాకంపై గంగారెడ్డి నిర్మిస్తున్నారు.

 
పవన్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు సినిమాలో మాధవీలత ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో ఆమె మైక్ పట్టుకుని ఉన్నారు. బ్యాగ్రౌండ్‌లో పవన్ కల్యాణ్ ఉన్నారు. దానిపై ‘మా నాయకుడు ఓట్లు అడగమని చెప్పాడు. కొనమని కాదు’ అని కాప్షన్ రాశారు. ఈ లుక్ పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలను అమితంగా ఆకట్టుకుంటోంది. గతంలో ‘సత్యాగ్రహి’ టైటిల్‌తో పవన్ కల్యాణ్ ఒక సినిమా చేయాలని అనుకున్నారు. కానీ, పోస్టర్ రిలీజ్ చేసిన తరవాత ఆపేశారు.

 
ఆ సినిమాలో చూపించాలని అనుకున్నది నిజ జీవితంలో చేస్తున్నానని ఒకానొక సందర్భంలో చెప్పారు. ఆ టైటిల్ మాధవీలత సినిమాకు పెట్టారు. పవన్ స్పూర్తితో ఆయన ఆశయాలు, సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకువెళ్లేలా ఈ సినిమా ఉంటుందని దర్శకుడు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: