టాలీవుడ్ సినిమా పరిశ్రమలో తొలి తరం సూపర్ స్టార్ అయిన విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నటరత్న ఎన్టీఆర్ నటనకు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హీరోగా సినిమా కెరీర్ ని ప్రారంభించిన అనంతరం ఎన్నో వందల సినిమాల్లోని తన పాత్రల ద్వారా కోట్లాది మంది ప్రేక్షకుల మనస్సులో అన్న గా ఎన్టీఆర్ గారు గొప్ప పేరు సంపాదించారు. ఆ తరువాత రాజకీయ రంగప్రవేశం చేసి తెలుగుదేశం పార్టీ పెట్టి అప్పట్లో అత్యధిక సీట్లతో గెలిచి ముఖ్యమంత్రిగా కూడా మరింత పేరు గడించారు. ఇక ఆయన నట వారసులుగా మొదట నందమూరి హరికృష్ణ, బాలకృష్ణ సినిమా పరిశ్రమకు ఎంట్రీ ఇవ్వగా, వారిలో బాలకృష్ణ హీరోగా పలు సినిమాలతో ఆయన సినీ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.  

తొలి సినిమా తాతమ్మ కల ద్వారా నటుడిగా తెలుగు సినిమా పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ, ఆ తరువాత నుండి ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుని హీరోగా కొనసాగారు. అనంతరం వాటితో ఎన్నో గొప్ప విజయాలు దక్కించుకుని తండ్రి ఎన్టీఆర్ కు తగ్గ తనయుడిగా టాలీవుడ్ నటసింహంగా బాలకృష్ణ మంచి పేరు దక్కించుకున్నారు. ఇక ఆయన నట వారసుడుగా కుమారుడు నందమూరి మోక్షజ్ఞ సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు అంటూ ఇటీవల కొన్నాళ్లుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రసారమైన విషయం తెలిసిందే. అయితే వాటిపై ఇప్పటివరకు ఎక్కడా కూడా అధికారిక సమాచారం లేదు. ఇక నేడు మోక్షజ్ఞ జన్మదినం సందర్భంగా ఆయన మూవీ ఎంట్రీ పై బాలకృష్ణ పక్కాగా ఒక నిర్ణయం తీసుకున్నట్లు టాలీవుడ్ వర్గాల టాక్.  

వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ నాడు మోక్షజ్ఞ తొలి సినిమా ఎంట్రీ ఉంటుందని, ఈ విషయమై ఇప్పటికే పలువురు దర్శకుల నుండి కథలు విన్న బాలకృష్ణ, అతి త్వరలో అందులోనుండి ఒక కథ ను ఎంపిక చేయనున్నారని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే మాత్రం ఇది నిజంగా నందమూరి ఫ్యాన్స్ కు పెద్ద పండుగ వార్త అని చెప్పకతప్పదు .....!!

మరింత సమాచారం తెలుసుకోండి: