కుమారి 21ఎఫ్ సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న భామ హెబ్బా పటేల్. ఈ సినిమా హిట్ తో అమ్మడు ఎక్కడికో వెళ్తుందని ఆశించారు.. కాని అమ్మడు రెమ్యునరేషన్ మీద పెట్టిన దృష్టి కథల ఎంపికల్లో పెట్టకపోయే సరికి ఆ ఎఫెక్ట్ కెరియర్ మీద పడ్డది. ప్రస్తుతం సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేస్తూ వస్తుంది హెబ్భా పటేల్ భీష్మలో చేసిన పాత్ర షాక్ ఇవ్వగా లేటెస్ట్ గా ఒరేయ్ బుజ్జిగా సినిమాలో సృజనా పాత్ర మరోసారి మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసింది.

ఆమె చేస్తున్న పాత్రలు ఆమె కెరియర్ కు ఉపయోగపడకపోగా ఇంకాస్త వెనక్కి నెట్టేలా చేస్తున్నాయని చెప్పొచ్చు. రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన ఒరేయ్ బుజ్జిగా సినిమాలో హెబ్భా పటేల్ సృజనా పాత్ర ఎందుకు ఒప్పుకుందో అర్ధం కాలేదు. ఏడో ఒక సినిమా చేసేయాలని ఆలోచన తప్ప ఆమె ఈ పాత్ర ఒప్పుకుని ఉండాల్సింది కాదు. తెలుగు రెండు రాష్ట్రాల్లో చాలా ఫేమస్ అయిన ఓ ఆడియో క్లిప్ సృజనా తిన్నావారా.. ఆ ఆడియో క్లిప్ లో ఉన్న సృజన పాత్రతో హెబ్భా క్యారక్టర్ రాసుకున్నట్టు ఉన్నాడు డైరక్టర్ విజయ్ కుమార్ కొండ.

సృజన పాత్రలో హెబ్బా అబ్బాయిలను లవ్ అంటూ మోసం చేస్తుంది. మరి హీరోయిన్ గా ఛాన్సులు రాకపోయినా వచ్చిన అరకొర సినిమాలు చేస్తే బెటర్ కాని ఇలా అమ్మడు ఏ పాత్ర పడితే ఆ పాత్ర చేసి ఇమేజ్ డ్యామేజ్ చేసుకోవడంలో అర్ధం లేదని అంటున్నారు. సినిమాలో మాళవిక నాయనర్ మెయిన్ హీరోయిన్ కాగా హెబ్బా పటేల్ తన పాత్రలో బాగానే చేసినా ఆమెను ఆ పాత్రలో చూసి ఆమె ఫ్యాన్స్ ఇబ్బంది పడ్డారు. ఏది ఏమైనా సృజనా తిన్నావారా స్పూర్తితో హెబ్భా పటేల్ ను సృజనని చేశాడు దర్శకుడు విజయ్ కుమార్ కొండ.    

మరింత సమాచారం తెలుసుకోండి: