నిన్నటిదాకా ఐస్ బకెట్ చాలెంజ్ లను ఒకరికొకరు విసురుకున్న బాలీవుడ్ సెలెబ్రెటీలు ఇప్పుడు లేటెస్ట్ గా ‘కర్వా చౌత్’ ఛాలెంజ్ లను ఒకరి పై ఒకరు విసురుకుంటూ మరో కొత్త ఛాలెంజ్ కి శ్రీకారం చుడుతున్నారు. ఉత్తర భారతదేశంలో దీపావళికి 9 రోజులు ముందు వచ్చే ఈ ‘కర్వా చౌత్’ వేడుకకు మహిళలు చాల ప్రాముఖ్యత ఇస్తారు.
తన భర్త, పిల్లలు బాగుండాలని కోరుకుంటూ ఆరోజు అంతా ఉపవాసం ఉంటారు. తమ జీవితాలకు శాంతి, సౌభాగ్యాలు కలిగిస్తుంది అనే నమ్మకంతో మహిళలు ఉత్తర భారతదేశ ప్రాంతాలలో అతి పవిత్రంగా జరుపుకునే ఈ వేడుకకు ఈసారి షాది.కామ్ అధినేత అనుపమ్ మిట్టల్ ఆధ్వర్యంలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది.
తమ కుటుంబాల కోసం తమ భార్యలు పడుతున్న కష్టానికి బాసటగా నిలుస్తూ ఈసారి ఈనెల 11న రాబోతున్న ‘కర్వా చౌత్’ రోజున తమ భార్యలతో పాటుగా తాము కూడా ఉపవాసాలు చేస్తాం అంటూ అనేక మంది బాలీవుడ్ సెలెబ్రెటీలు, టివి సెలెబ్రెటీలు రంగంలోకి దిగుతూ తమలా ఉపవాసాలు చేసి భార్యల పట్ల తమకు ఉన్న అభిమానాన్ని దక్షిణాదికి చెందిన ఎవరైనా చూపెట్టగలరా? అని విసిరిన ఛాలెంజ్ కి టాలీవుడ్ హీరో నాని స్పందించడమే కాకుండా తన భార్య కోసం రాబోతున్న ‘కర్వా చౌత్’ రోజున ఉపవాసం చేయబోతున్నట్లు సమాచారం.
భార్య, భర్తల మధ్య సమానత్వం కోసం, భార్యల పట్ల తమ ప్రేమను వ్యక్త పరచడం కోసం ఉత్తర భారతదేశ ప్రాంతాలలో బాగా ప్రాచూర్యం పొందిన ఈ సాంప్రదాయాన్ని తెలుగు ప్రజలకు నాని తన భార్య కోసం పరిచయం చేస్తూ ఉండటంతో నాని విసురుతున్న ఛాలెంజ్ ని మన టాలీవుడ్ హీరోలు ఇంకా ఎంతమంది స్వీకరిస్తారో చూడాలి. మా భార్యల కోసం మా ఉపవాసం అనే కొత్త నినాదంతో ముందుకు వస్తున్న ఈ సాంప్రదాయాన్ని ఎంతమంది ఆదరిస్తారో చూడాలి.
మరింత సమాచారం తెలుసుకోండి: