రాబోయే
మార్చి 11న అనగా
మహా శివరాత్రి పర్వదినం రోజున
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పీరియాడికల్
మూవీ యొక్క ఫస్ట్ లుక్
పోస్టర్ తో పాటు టైటిల్ కూడా రివీల్ కానున్న విషయం తెలిసిందే.
టాలీవుడ్ ప్రముఖ నిర్మాతల్లో ఒకరైన ఏ ఎం రత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తన మెగా
సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక వజ్రాల
దొంగ పాత్ర పోషిస్తుండగా
నిధి అగర్వాల్ ఇందులో
హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది.
కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న ఈ
సినిమా ప్రస్తుతం వేగవంతంగా షూటింగ్ జరుపుకుంటోంది.

మరోవైపు కెరీర్ పరంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న
బాలయ్య ప్రస్తుతం తనకు కలిసి వచ్చిన దర్శకుడు
బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక భారీ ప్రతిష్టాత్మక
సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. బిబి3 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ
మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ లో
బాలయ్య డ్యూయల్ రోల్ చేస్తుండగా ఆయనకు జోడీగా
ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నట్లు తెలుస్తోంది.
యువ సంగీత తరంగం
తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీని
మిరియాల రవీందర్ రెడ్డి ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై ఎంతో భారీ లెవల్లో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. కాగా ఈ
సినిమా యొక్క టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్
పోస్టర్ కూడా
మహా శివరాత్రి పండుగ రోజున రిలీజ్ కానున్నట్లు లేటెస్ట్
టాలీవుడ్ వర్గాల టాక్.
కాగా ఈ రెండు సినిమాలతో పాటు
విక్టరీ వెంకటేష్ హీరోగా
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న
నారప్ప మూవీ థియేట్రికల్ ట్రైలర్ కూడా
మహా శివరాత్రి రోజు రిలీజ్ కానుందని అంటున్నారు. ఇప్పటికే ట్రైలర్ కట్ కి సంబంధించి
నారప్ప యూనిట్ పనులు ప్రారంభించిందని అతి త్వరలో దీనికి సంబంధించి అధికారికంగా న్యూస్ కూడా బయటకు రానుందని అంటున్నారు.
ప్రియమణి హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని
సురేష్ ప్రొడక్షన్స్,
వి క్రియేషన్స్ సంస్థలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. మొత్తంగా రాబోయే మహాశివరాత్రి నాడు అటు
పవన్, ఇటు బాలయ్యతో పాటు
వెంకీ అభిమానులకి కూడా
పండుగ న్యూస్ రానున్నట్లు తెలుస్తోంది.....!!