పవర్‌స్టార్  తెలుగు ప్రేక్షకులకు మొన్న శివరాత్రి రోజున ఎవరు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు.ఆ రోజు సందర్భంగా పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్,  డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్‌లో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అగ్ర నిర్మాత ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మూవీకి ‘హరి హర వీరమల్లు’ అనే పేరు ఫిక్స్ చేస్తూ టీజర్ ని రిలీజ్ చేశారు.పవన్ నటిస్తున్న 27వ సినిమా ఇది. ఈ సినిమాలో పవన్ వజ్రాల దొంగ ‘హరి హర వీరమల్లు’ పాత్రలో సరికొత్త గెటప్‌లో కనిపించనున్నారు. ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్, మహారాణి పాత్రలో కనిపించనుంది.

అయితే ఈ సినిమాలో నిధి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి నటించడం గురించి మాట్లాడుతూ నేను ఇప్పటిదాకా చేసిన హీరోస్ లో ఆయనే నా బెస్ట్ హీరో అని ఆమె అన్నారు. ఈ సినిమా సెట్ లో పవన్ కళ్యాణ్ వస్తే అందరూ పనులు మానేసి ఆయన్నే చూస్తుంటారు అని నిధి అన్నారు.ఇక పవర్‌స్టార్ కెరీర్‌లో మొట్టమొదటిసారిగా పాన్ ఇండియా స్థాయిలో హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో భారీగా విడుదల కానుంది.2022 సంక్రాంతికి పవన్ ‘హరి హర వీరమల్లు’ గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.  అలాగే ఈ సినిమాకి  సంగీతం ఎం.ఎం.కీరవాణి చేయడంతో అంచనాలు పెరిగాయి.

అయితే పవన్ కళ్యాణ్ అసలు ఇప్పటిదాకా చేయని ఒక కొత్త పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నారు. దానితో ఆయన అభిమానులు ఈ సినిమా టీజర్ చూసి ఆశ్చర్యపోయారు. ఈ సినిమాలో ఆయన భారీ రేంజ్ లో పోరాటాలు చేయబోతున్నారు అని టాక్. వచ్చే సంక్రాంతిసినిమా ఘనంగా విడుదల కాబోతున్నది.ఈ సినిమా టీజర్ కి మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాతో పాటు మహేష్ బాబు సర్కారు వారి పాట కూడా విడుదల కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: