
ఇక చాప్టర్ వన్ కన్నడ సహా పలు ఇతర భాషల్లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయి ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దానితో కె.జి.ఎఫ్ చాప్టర్ 2 పై అందరిలోనూ భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. కాగా ఈ మూవీలో రాఖీ బాయ్ గా నటించిన యాష్ కి ప్రేక్షకాభిమానుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. తెలుగు నటుడు రావు రమేష్, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తో పాటు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, రవీనా టాండన్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఇటీవలే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. కొన్నాళ్ళ క్రితం యూట్యూబ్ లో రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ అత్యధిక స్థాయి వ్యూస్, లైక్స్ తో సరికొత్త సంచలనం సృష్టించింది.
అయితే గత కొన్నాళ్లుగా ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో అనుకున్న విధంగానే జూలై 16న ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేదా అని అనుమానం కొందరు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మరో వైపు కే జి ఎఫ్ చాప్టర్ 2 యూనిట్ మూవీ యొక్క ఫస్ట్ థియేట్రికల్ ట్రైలర్ కి ముహూర్తం ఫిక్స్ చేసిందని ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ సినిమాకు సంబంధించి వరుసగా అప్డేట్స్ వస్తూనే ఉంటాయని ఈ లోపు సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగవంతంగా నిర్వహించేలా కూడా యూనిట్ ప్రణాళిక సిద్ధం చేసిందని చెప్తున్నారు. అలానే సినిమా నుండి ఎటువంటి సీన్స్ లీక్ కాకుండా యూనిట్ పక్కాగా జాగ్రత్తలు కూడా తీసుకుంటుందట. మరి ఎన్నో అంచనాలతో అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.....!!