ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి పలు ఆసక్తికరమైన సినిమా ప్రాజెక్టులను లైన్ లో పెట్టారు. అభిమానులు చిరు తదుపరి చిత్రాల రిలీజ్ కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఆచార్య సినిమాలో తన కుమారుడు రామ్ చరణ్ తో కలిసి చిరంజీవి నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే వెండితెరపై తండ్రీకొడుకులిద్దరి యాక్షన్ చూడాలని ఫ్యాన్స్ ఉవ్విళూరుతున్నారు. ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి చేసిన అనంతరం చిరంజీవి మలయాళం లో బ్లాక్ బస్టర్ హిట్టయిన లూసిఫర్ రీమేక్ యొక్క షూటింగ్ ప్రారంభించనున్నారు.


అయితే ఈ సినిమాకి దర్శకత్వ బాధ్యతలు డైరెక్టర్ మోహన్ రాజాకు చిరంజీవి అప్పజెప్పారు. ఆయన కొంతకాలంగా తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా లూసిఫర్ ఒరిజినల్ స్క్రిప్ట్ లో మార్పులు చేసే పనిలో నిమగ్నమయ్యారు. అయితే స్క్రిప్ట్ లో మార్పుల విషయంలో మోహన్ రాజా చిరంజీవితో ఎన్నోసార్లు చర్చించారట. కానీ మెగాస్టార్ కి మాత్రం మోహన్ రాజా స్క్రిప్ట్ పరంగా చెప్పిన సలహాలు అస్సలు నచ్చలేదట. ఆయన ఇప్పటికే అనేక రకాలుగా కథ మార్చినప్పటికీ చిరంజీవి మాత్రం ఇంకా చాలా మార్పులు చేయాలని సూచిస్తున్నారట. కాగా, మెగాస్టార్ చిరంజీవిని మెప్పించడంలో ఫెయిల్ అవుతున్నానని మోహన్ రాజా బాధపడుతున్నారట.



మరోవైపు మోహన్ రాజా ని మార్చేసి మరో డైరెక్టర్ ని ఎంపిక చేసుకోవాలని చిరంజీవి యోచిస్తున్నారని తెలుస్తోంది. నిజానికి లూసిఫర్ సినిమాని రీమేక్ చేయడమంటే ఆషామాషీ కాదు. కేరళతో పోల్చితే తెలుగు రాష్ట్రాల రాజకీయాలు చాలా భిన్నంగా ఉంటాయి. ఈ సినిమాలోని కేరళ రాజకీయాలకు సంబంధించి ఉన్న సన్నివేశాలను తెలంగాణ/ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలకు తగ్గట్టుగా మార్చడం చాలా క్లిష్టమైన పని. అంతేకాకుండా చిరంజీవి రియల్ పొలిటికల్ కెరీర్ అర్ధాంతరంగా ఆగిపోయింది. దీంతో దర్శకుడు మోహన్ రాజా లూసిఫర్ రీమేక్ ని చాలా జాగ్రత్తగా రూపొందించాల్సి వస్తోంది. అందుకే లూసిఫర్ వంటి సీరియస్ పొలిటికల్ డ్రామా ని తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టుగా చేంజ్ చేసే విషయంలో మోహన్ రాజా పూర్తిగా సక్సెస్ కాలేక పోతున్నారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: