టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ సెలెబ్రెటీ లలో కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులలో మహేష్ తీసుకుంటున్న జాగ్రత్తలు మరి ఏ టాప్ హీరో తీసుకోవడం లేదు అంటే అతిశయోక్తి కాదు. ఈ సెకండ్ వేవ్ మొదలైన దగ్గర నుంచి మహేష్ ఎవరిని కలవకుండా తనకు తానే స్వీయ గృహ నిర్భందంలో ఉంటూ కరోనా జాగ్రత్తలు తూచా తప్పకుండా పాటిస్తున్నాడు.


తన ఇంటిలో పనిచేసే పనివాళ్ళకు కూడ ప్రతిరోజు కరోనా టెస్ట్ లు చేయిస్తూ అతి జాగ్రత్తలు తీసుకుంటున్నాడని ఆమధ్య ఒక ప్రముఖ ఛానల్ ఆశక్తికర న్యూస్ ప్రసారం చేసింది. ఈ పరిస్థితుల మధ్య లేటెస్ట్  గా మహేష్ ను కలవడానికి ప్రయత్నాలు చేసిన త్రివిక్రమ్ కు కూడ ఇదే పరిస్థితి ఏర్పడింది అన్న మాటలు వినిపిస్తున్నాయి.


ఈనెల మే 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజునాడు విడుదల చేయాలి అని అనుకుంటున్న త్రివిక్రమ్ మహేష్మూవీ పోష్టర్ కు సంబంధించిన చర్చలు కూడ వీరిద్దరూ కలవకుండా జూమ్ యాప్ ద్వారా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఈమూవీలోని కీలక నటుల ఎంపిక విషయమై జరిగిన చర్చలు కూడ ఈ యాప్ ద్వారానే జరిగినట్లు టాక్.



ఇది ఇలా ఉంటే మహేష్ అభిమానులు ఇప్పటికే ఈమూవీ పోష్టర్ రిలీజ్ ను పురస్కరించుకుని ‘#SSMBRampageOnMAY31st.’ అంటూ ఒక హ్యాష్ ట్యాగ్ ను క్రియేట్ చేసి ఆరోజున విడుదల కాబోయే ఈ మూవీ పోష్టర్ ను సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా చేయాలని ఇప్పటి నుంచే పక్కా వ్యూహాలు రచిస్తున్నారు. తన తండ్రి కృష్ణ పుట్టినరోజునాడు తన సినిమాకు సంబంధించిన ఎదో ఒక హడావిడి చేయడం మహేష్ కు ఎప్పటి నుంచో కొనసాగుతున్న అలవాటు. ఇపుఉడు మళ్ళీ అదే త్రివిక్రమ్ మహేష్ ల మూవీలో రిపీట్ కాబోతోంది. కనీసం షూటింగ్ కూడ ప్రారంభం కాని ఈసినిమాకు సంబంధించిన హ్యాష్ ట్యాగ్ చేయబోయే హడావిడి బట్టి టాప్ హీరోల సినిమా అంటే ఏ రేంజ్ లో ఉంటాయో అర్థం అవుతుంది..



మరింత సమాచారం తెలుసుకోండి: