నందమూరి బాలకృష్ణ ఆవేశంతో ఏదైనా ఒక మాట అంటే అది ఎప్పుడు సంచలనమే. తన పుట్టినరోజు సందర్భంగా ఒక ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలకృష్ణ తాను తన తండ్రి ఎన్టీఆర్ పై వ్రాయబోతున్న పుస్తకం గురించి వివరణ ఇచ్చాడు.

ఇప్పటివరకు తన తండ్రి పై ఎందరో ఎన్నో పుస్తకాలు వ్రాసినప్పటికీ ఆ పుస్తకాలు తనకు సంతృప్తిని కలిగించ లేకపోయాయని అందువల్లనే తాను తన తండ్రి జీవితం పై ఒక పుస్తకం వ్రాయాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరణ ఇచ్చాడు. అంతేకాదు తెలుగు సంస్కృతిలో రామాయణ మహాభారతాలు శాస్వితంగా ఎలాంటి సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్నాయో తాను రాస్తున్న ఎన్టీఆర్ జీవిత చరిత్ర కూడ తెలుగు సంస్కృతి భాష ఉన్నంతవరకు ఎన్టీఆర్ పై వ్రాస్తున్న పుస్తకం శాస్వితంగా ఉంటుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు.

ఈ మాటలు బాలకృష్ణ నోటి నుండి వచ్చిన మరుక్షణం నుండి అప్పుడే రకరకాల సెటైర్లు మొదలైపోయాయి. ఇదే సందర్భంలో బాలయ్య తెలుగుదేశంలో జూనియర్ ఎన్టీఆర్ స్థానం గురించి చేసిన వ్యాఖ్యలు కూడ పెను దుమారాన్ని సృష్టిస్తున్నాయి. తారక్ వలన తెలుగుదేశం పార్టీకి ప్లస్ తో పాటు మైనస్ కూడ ఉంటుంది అంటూ చేసిన వ్యాఖ్యలు మరొకసారి బాలయ్య జూనియర్ ల మధ్య గ్యాప్ ను సూచిస్తున్నాయి.

మోక్షజ్ఞ ఫిలిం ఎంట్రీ గురించి మాట్లాడుతూ తాను నిర్మించబోయే ‘ఆదిత్య ౩69’ సీక్వెల్ లో మోక్షజ్ఞ నటిస్తాడు అని చెప్పడంతో తిరిగి మోక్షజ్ఞ ఫిలిం ఎంట్రీ పై ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. బాలయ్య ఒక కామెంట్ చేసిన వెంటనే వాటి పై నెగిటివ్ కామెంట్స్ అదేవిధంగా ట్రోలింగ్ జరగడం సర్వసాధారణం. ఇప్పుడు కూడ నిన్నటి బాలయ్య ఇంటర్వ్యూ పై అనేక సెటైర్లు నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. అయితే తనపై వచ్చే సెటైర్లను ఏమాత్రం పట్టించుకోని బాలకృష్ణ మాత్రం ఈసారి జూనియర్ పై చేసిన కామెంట్స్ కు ఎంతవరకు అభిప్రాయం మార్చుకోకుండా ఉంటాడో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: