
మలయాళ సినీ పరిశ్రమలో నటిగా ఓనమాలు దిద్ది తమిళ్ లో కొన్ని సినిమాలు చేసి తెలుగు లోకి ఎంటర్ అయ్యింది మాళవిక. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈమె ఆ తర్వాత పెద్దగా అవకాశాలు దక్కించుకోలేకపోయింది. ఈ సినిమా హిట్ మాళవికను క్రేజీ హీరోయిన్స్ లిస్టులో చేర్చలేదు. నటన పరంగా ఆమె ప్రేక్షకులను సంతృప్తి పరిచిన అదృష్టం కలిసిరాక ఆమె వేరే దర్శకుల కళ్ళల్లో పడలేక పోయింది.
ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా తర్వాత కల్యాణ వైభోగమే, విజేత వంటి సినిమాల్లో నటించి మంచి నటిగా మరింత గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఆమెకు అవకాశాలు రావడం చాలా కష్టం అయిపోయింది. విజయ్ దేవరకొండ టాక్సీ వాలా చిత్రంలో ఓ కీలక పాత్రలో చేసిన ఆమె ఆ తర్వాత రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కిన ఒరేయ్ బుజ్జిగా సినిమాలో కూడా హీరోయిన్ గా నటించి హిట్లు కొట్టింది. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం థాంక్యూ లో ముగ్గురు హీరోయిన్లలో ఒక హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో అయినా ఆమెకు అదృష్టం కలిసి వస్తుందా అని ఆమె అభిమానులు చర్చించుకుంటున్నారు.///