తన కళ్ళతో, తన హావభావాలతో, తన అందంతో కుర్రకారు నుంచి పండు ముసలి వరకు నిద్రలేని రాత్రులు మిగిల్చిన హాట్ బాంబ్ సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకొని దాదాపు పాతిక సంవత్సరాలు కావస్తోంది. శృంగార తారగా పేరొందిన సిల్క్ స్మిత తన 17 ఏళ్ల కెరీర్ లో ఐదు భాషల్లో 450కి పైగా చిత్రాల్లో నటించారు. 1996 సెప్టెంబర్ 23 వ తేదీన సిల్క్ స్మిత చెన్నై లో ఆత్మహత్య చేసుకున్నారు. ప్రేమలో మోసపోయి, ఆర్థికంగా చితికిపోయి, తీవ్ర డిప్రెషన్ కి లోనై చివరికి ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటారని అప్పట్లో వార్తలు హల్ చల్ చేశాయి.

సిల్క్ స్మిత ఏలూరు సమీపంలోని దెందులూరు గ్రామంలో ఒక కటిక పేదరికమైన కుటుంబంలో విజయలక్ష్మి గా జన్మించారు. ఐతే వండి చక్రం సినిమాలో ఈమె పోషించిన సిల్క్ పాత్ర బహుళ ప్రజాదరణ పొందడంతో ఆమె తన పేరుని సిల్క్ స్మిత గా మార్చుకున్నారు. పడతి పాత్రల్లో అద్భుతంగా జీవించేసిన ఈ ముద్దుగుమ్మ తన వగలమారి హొయలతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ని ఒక ఊపు ఊపారు. 1980-90 కాలంలో ఆమె క్రేజీ స్టార్ గా రాణించారు. ఆమె లేనిదే సినిమా హిట్ కాదు అనే భావనకు దర్శక నిర్మాతలు వచ్చారంటే ఆమె క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆమె ఒక్క పాటలో చిందేసినా.. ఆ సినిమా చూసేందుకు ప్రేక్షకులు తండోపతండాలుగా థియేటర్లకు తరలి వచ్చేవారు.

అయితే ఆమెకు ఏ హీరోయిన్ కి రానంతగా పాపులారిటీ వచ్చినప్పటికీ.. ఒక్క సినిమాలో కూడా హీరోయిన్ గా నటించే అవకాశం రాలేదు. దీంతో ఆమె కేవలం బోల్డ్ క్యారెక్టర్ లకు మాత్రమే పరిమితమయ్యారు. అయితే కాలక్రమేణా ఆమె నిర్మాణ రంగంలోకి అడుగు మోపి తీవ్ర నష్టాలను చూశారు. మరోవైపు తక్కువ పారితోషికం తీసుకొని ఎక్కువ ఎక్స్పోజింగ్ చేసే నటిమణులు విపరీతంగా పెరిగిపోయారు. దీంతో ఆమెకు అవకాశాలు బాగా సన్నగిల్లాయి. ప్రొఫెషనల్ లైఫ్ తో పాటు వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురు కావడంతో ఆమె మానసికంగా కృంగిపోయారు. భారత సినీ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన ఈ అందాలభామ చివరికి 36 ఏళ్ళ వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: