ఇప్పటి వరకు ఓ లెక్క ఇకపై ఓ లెక్క అంటోంది బిగ్ బాస్ బ్యూటీ హారిక. ఒకప్పుడు యూట్యూబ్ వీక్షకులకు మాత్రమే సుపరిచితురాలుగా ఉన్న ఈ అందాల భామ ఆఫ్టర్ బిగ్ బాస్ సీజన్ ఫోర్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో మరింత గుర్తింపు పొందింది. ఈ షో లో తన డ్రెస్సింగ్ స్టైల్ కు యూత్ బాగా అట్రాక్ట్ అయ్యారు. ఇక షో నుండి బయటకు వచ్చిన ఈ అమ్మడు హీరోయిన్ కావడమే తన ఏకైక లక్ష్యం అన్నట్టుగా సోషల్ మీడియాలో గ్లామర్ విందుతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఆమె పోస్ట్ చేస్తున్న ఫోటో షూట్స్ ఓ రేంజ్ లో ఉంటున్నాయి. పొట్టి బట్టల్లో స్కిన్ షో మామూలుగా లేదు. ఓ వైపు వెబ్ సిరీస్ లో నటిస్తూ టాక్ అఫ్ ది ఇండస్ట్రీ గా నిలుస్తోంది. అయితే ఇంత గట్టిగా ప్రయత్నిస్తున్నా ఓ చిన్న సినిమాల్లో కూడా హీరోయిన్ గా ఛాన్స్ రాకపోవడంతో ఇక టైం వేస్ట్ చెయ్యడం వృధా అనుకుని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నైనా వెండితెరపై కనిపించాలని ఫిక్స్ అయ్యారట హారిక.
ఇప్పటికే ఓ సినిమాలో హరిక ఎంపికైనట్లు ఫిల్మ్ సర్కిల్స్ నుండి టాక్ వినిపిస్తోంది. అది కూడా మాస్ మ‌హారాజా రవితేజ‌ తదుపరి చిత్రంలో అని  గుసగుసలు వినబడుతున్నాయి. ప్రస్తుతం హీరో రవితేజ ఖిలాడీ సినిమాతో బిజీగా ఉండగా ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఆ తర్వాత శరత్ మండవ డైరెక్షన్ లో తన 68వ చిత్రం చేయడానికి మాస్ హీరో రవితేజ సైన్ చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రంలో ఓ ప్రముఖ పాత్ర కోసం దేత్తడి హారిక ను ఎంపిక చేసినట్లు సినీ  విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం.

 అనుకున్నట్లుగా హీరోయిన్ కాలేకపోయినప్పటికీ సీనియర్ హీరో సినిమాలో ఛాన్స్ అంటే ఒకరకంగా గొప్ప విషయమే. ఈ సినిమా ఇచ్చే హైప్ తో హీరోయిన్ గా ఛాన్స్  వస్తుందని భావిస్తోందట హారిక. అయితే ఇంతకీ హీరో రవితేజ మూవీలో హారిక ఫైనల్ అయ్యారా లేదా అన్న విషయంపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: