హీరోల కొడుకులు తమ తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ హీరోలుగా కొనసాగుతూ ఉంటే హీరోల కూతుళ్ళు డ్రెస్ డిజైనర్స్ బొటిక్ వోనర్స్ రెస్టారెంట్ నిర్వాహకులుగా ఇలా రకరకాల రంగాలలో ఎప్పటి నుంచో రాణిస్తున్నారు. అయితే వెంకటేష్ కూతురు మాత్రం చాల విభిన్నంగా ఒక రంగాన్ని ఎంచుకుంది.


వెంకటేష్ కూతురు ఆశ్రిత అమెరికాలో ఫుడ్ టెక్నాలజీలో మాష్టర్ డిగ్రీ చేసింది. కొంతకాలం క్రితం భాగ్యనగరంలో పేరు గాంచిన వ్యాపార వేత్తల కుటుంబానికి చెందిన వినాయక్ రెడ్డి ని ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్ళి చేసుకున్న ఆశ్రిత ఒక ప్రముఖ ఫుడ్ స్టోర్స్ చైన్ ను భాగ్యనగరంలో తన భర్త సహకారంతో నిర్వహిస్తోంది.


తన వ్యాపారం కొనసాగిస్తూనే సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇన్ స్టా గ్రామ్ లో చాల యాక్టివ్ గా ఉంటూ వంటలకు సంబంధించిన అనేక విషయాలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇన్ స్టా గ్రామ్ లో ఆమెకు లక్షకు పైగా ఫాలోయర్స్ ఉన్నారు.ఆమె పాపులారిటీని గ్రహించిన ఇన్ స్టా గ్రామ్ సంస్థ ఆసియా ఖండంలో బాగా పాపులర్ అయిన ఇన్ స్టా గ్రామర్స్ లో ఆమెకు 27వ స్థానాన్ని కల్పించడమే కాకుండా ఆమె చేసే ప్రతి ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ కు 400 డాలర్లు చెల్లిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.


ప్రపంచ వ్యాప్తంగా ఇన్ స్టా గ్రామర్ల రేటింగ్స్ లో కోట్లమంది ఫాలోయర్స్ కలిగిన ప్రియాంకా చోప్రా విరాట్ కోహ్లీ లకు ఇన్ స్టా గ్రామ్ సంస్థ వారు చేసే ఒకోక్క పోస్ట్ కు కోట్లల్లో పారితోషికం ఇస్తున్న పరిస్థితులలో ఇప్పుడు సెలెబ్రెటీ లకు సోషల్ మీడియా కూడ ఒక ఆదాయ వనరులుగా మారింది. వెంకటేష్ అభిమానులు ఎప్పటి నుంచో అతడి కొడుకు హీరోగా ఎప్పుడు అవుతాడు అని ఎదురు చూస్తుంటే అతడి కంటే ముందుగా ఇప్పుడు ఆశ్రిత సోషల్ మీడియా సంచలనంగా మారడంతో ఇప్పుడు ఈవార్త మీడియాకు హాట్ న్యూస్ గా మారింది..




మరింత సమాచారం తెలుసుకోండి: