టాలీవుడ్ సినీ పరిశ్రమలో హీరోయిన్ నగ్మా కు ఉన్న క్రేజ్ వేరే. హీరోయిన్ గా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన నగ్మా మహారాష్ట్ర ముంబై ప్రాంతానికి చెందినది. హిందీ సినిమా భాగి తో ఆమె తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టగా తెలుగులో పెద్దింటి అల్లుడు సినిమా ద్వారా పరిచయమై ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించింది. ఆమె నటించిన ఘరానా మొగుడు చిత్రంలోని నటనకు గానూ ఉత్తమ నటి అవార్డును అందుకుంది. అశ్వమేధం, మేజర్ చంద్రకాంత్, వారసుడు, కొండపల్లి రాజా, అల్లరి అల్లుడు , గ్యాంగ్ మాస్టర్, సూపర్ పోలీస్, ముగ్గురు మొనగాళ్లు, రిక్షావోడు, సరదా బుల్లోడు, సూర్యపుత్రులు వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ అయింది.

ఈమె తెలుగులో మాత్రమే కాకుండా హిందీ తమిళ మలయాళ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. అంతేకాదు దు దు తన కెరియర్ చివర్లో భోజ్ పూరి సినిమాల్లో కూడా నటించి అక్కడ భారీ ఫాలోయింగ్ ను ఏర్పరుచుకుంది. చివరిగా తెలుగులో ఆమె నిను చూడక నేనుండలేను అనే సినిమాలో స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వగా హీరోయిన్ గా సూర్యపుత్రులు అనే సినిమాలో నటించి తెలుగు సినిమా పరిశ్రమకు గుడ్ బాయ్ చెప్పింది. మహారాష్ట్రలో ముంబై ప్రాంతంలో జన్మించిన ఈమె వ్యక్తిగత జీవితం చాలా తక్కువ మందికి తెలుసు.

నగ్మా తండ్రి అరవింద్ ప్రతాప్ సింహ్ మొరార్జీ జైసల్మేర్ రాజరికం నేపథ్యం గల పూర్వీకుల కుటుంబానికి చెందినవాడు. అయితే జీవనం కోసం వీరు గుజరాత్ లోని పోర్ బందర్ , ముంబై వలస వెళ్లారు. ఆమె తాతమ్మ గోకుల్ దాస్ మురార్జీ ఓ వ్యాపార వేత్త. ఆమెకు షిప్పింగ్ వస్త్ర వ్యవసాయ ఫార్మాస్యూటికల్ పరిశ్రమలు కూడా ఉండేవి. నగ్మా తల్లి మహారాష్ట్రకు చెందిన కొంకణ్ ప్రాంతానికి చెందినది. ఆమె కాజీ స్వాతంత్ర ఉద్యమ కారుల కుటుంబానికి చెందినది. 
 1969 లో నగ్మా తల్లి దండ్రులకు ముంబైలో వివాహం 1974లో వారు విడిపోయారని పాస్ పోర్ట్ ఆధారంగా తెలుస్తోంది.  ఆ తర్వాత ఆమె పేరును నగ్మా అరవింద్ మోరారీ గా మార్చుకుంది.  విడాకులు  తీసుకున్న తర్వాత నగ్మా తల్లి ఓ నిర్మాత ను వివాహం చేసుకుంది. ఆయనకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: