లీడర్ సినిమాలో హీరోయిన్ గా నటించిన ప్రియా ఆనంద్ గురించి అందరికీ తెలిసిందే. ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పలు తెలుగు సినిమాల్లో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని పొందింది. తమిళ చిత్ర పరిశ్రమలో వామనన్ అనే సినిమాతో సినీ పరిశ్రమకు పరిచయమైన ఈమె తెలుగులో రామ రామ కృష్ణ కృష్ణ కో అంటే కోటి వంటి సినిమా ల్లో నటించి సరైన అవకాశాలు లేక తమిళ సినిమా పరిశ్రమకు తరలిపోయింది.

ఆక్కడ మంచి మంచి సినిమాలు చేసి హీరోయిన్ గా సెటిల్ అయ్యింది.  మలయాళ చిత్ర పరిశ్రమలో సైతం ఆమె నటించి అక్కడ మంచి పాపులారిటీ దక్కించుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఆరు సినిమాలు ఉన్నాయి. తమిళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాలు హిట్ అయితే అవి ఆమె అక్కడ స్టార్ హీరోయిన్ కావడం ఖాయం అనిపిస్తుంది. చెన్నై లో పుట్టి పెరిగిన ప్రియ జర్నలిజం చదువుకొని మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి పలు వ్యాపార ప్రకటనలు చేశారు. దాని ద్వారా సినిమా పరిశ్రమలోకి వచ్చి సినిమాలు చేసి హీరోయిన్ గా సెటిల్ అయ్యారు.

తొలి సినిమా హిట్ కొట్టినప్పటికీ ఆమె కు పెద్దగా గుర్తింపు రాలేదు. రానా దగ్గుబాటి రామ్ పోతినేని సిద్ధార్థ శర్వానంద్ వంటి హీరోలతో నటించిన ఈ బ్యూటీకి తెలుగులో అవకాశాలు ఎక్కువగా రాలేదు. వచ్చినా గెస్ట్ పాత్రలకు మాత్రమే పరిమితమై పోయింది. దాంతో మెల్లమెల్లగా ఆమె తెలుగు సినిమా పరిశ్రమకు దూరం కాక తప్పలేదు. ఈ బ్యూటీకి సినిమా అవకాశాలు లేకపోవడం వల్లనే ఇండస్ట్రీని వదిలి వేసింది కానీ డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించిన కొంతవరకూ గ్లామర్ ను ప్రదర్శించింది.  ప్రస్తుతం తనకు కం బ్యాక్ ఇచ్చే సినిమా కోసం వెతుకుతుంది ప్రియ. మరి తెలుగులో ఆమెకు ఏ సినిమా ఆమెకు వరిస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: