టైటిల్ చూసి ఇదేదో సినిమా డైలాగ్ లా ఉందని అనుకోవచ్చు. కాని ఇది ప్రస్తుతం ఒక హీరోని పోల్చి చెప్పిన సందర్భం. తెల్లారితే తన సినిమా రిలీజ్.. కరోనా సెకండ్ వేవ్ వల్ల ఇన్నాళ్లు మూత పడ్డ థియేటర్లు.. సినిమాకు ఆడియెన్స్ వస్తారో రారో అన్న టెన్షన్.. వీటన్నిటి మధ్య తన సినిమా ప్రమోషన్స్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు యువ హీరో సత్యదేవ్. అతను నటించిన తిమ్మరుసు మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడానికి ట్రైలర్ ను ఎన్.టి.ఆర్ తో.. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నానితో చేయించారు. ఎన్ని ఓటీటీ ఫ్లాట్ ఫాం లు వచ్చినా పెద్ద తెర మీద బొమ్మ చూస్తేనే సినిమా చూశామన్న భావన ఉంటుంది. ఈ క్రమంలో తన సినిమా చూడాలని కోరుతూ సత్యదేవ్ చేస్తున్న ప్రమోషన్స్ ఆకట్టుకున్నాయి. లేటెస్ట్ గా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని దేవి 70 ఎం.ఎం థియేటర్ కు వెళ్లి అక్కడ అందరిని పలుకరించి థియేటర్ వాతావరణాన్ని చూసి వచ్చాడు సత్యదేవ్.

తన సినిమా వాల్ పోస్టర్.. టికెట్ బుకింగ్ సెంటర్.. కూల్ డ్రింక్ సేల్ పర్సన్.. ఇలా అందరిని పలుకరించి ఫైనల్ గా స్క్రీన్ ను అలా చూస్తూ రేపు కలుద్దాం అంటాడు. మొత్తానికి సత్యదేవ్ తిమ్మరుసు ప్రమోషన్స్ బాగానే ఉన్నయని చెప్పాలి. ఇక ఈ క్రమంలో థియేటర్ బయట తన సినిమా పోస్టర్ ను చూపిస్తూ ప్రస్తుతానికి పోస్టర్ మాత్రమే తర్వాత కటౌట్ రేంజ్ వస్తుందని అంటున్నట్టు అనిపిస్తుంది. అయినా కంటెంట్ ఉన్న సినిమాకు.. కంటెంట్ ఉన్న హీరోకి కటౌట్ కూడా అవసరం లేదు అన్నది తెలిసిందే. స్టార్స్ కూడా శుక్ర్వారం రిలీజ్ ఆవుతున్న తిమ్మరుసు, ఇష్క్ సినిమాల రిజల్ట్ పై ఎక్సయిటింగ్ గా ఉన్నారు. పరిశ్రమ పెద్దలు కూడా రేపు రిలీజ్ అవబోతున్న సినిమాల ఫలితాల మీద ఆసక్తిగా ఉన్నారు.  

 


మరింత సమాచారం తెలుసుకోండి: