బాలీవుడ్ ఐటం బాంబ్ రాఖీ సావంత్ వివాదాలకు దాదాపుగా ఎప్పుడూ కేరాఫ్‌గా ఉంటుంది. వివాదాలు ఎక్కడున్నాయా? అని వెతికి మరీ అక్కడకు వెళ్లి చిక్కుకున్ని రచ్చ రచ్చ చేసేస్తుంటుంది. తాజాగా ఈ భామ ఏకంగా స్పైడర్ ఉమన్ అవతరమెత్తి రోడ్డు మీదకు వచ్చి హల్‌చల్ చేసింది. తనను ‘బిగ్ బాస్ 15 ఓటీటీ’లోకి తీసుకోవాలని డిమాండ్ చేసింది. ముంబై వీధుల్లో ఈ అవతారంతో తిరిగి రచ్చరచ్చ చేసింది. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియోస్ వైరల్ అవుతున్నాయి.

వీడియోలలో రాఖీ సావంత్ స్పైడర్ ఉమన్ అవతారంలో సూట్‌కేస్‌తో పాటు రోడ్ల మీద వయ్యారాలు పోతూ క్రేజీ డ్యాన్స్ మూమెంట్స్ చేస్తోంది. తనను ‘బిగ్ బాస్’ లేటెస్ట్ సీజన్ లోకి తీసుకోవాలని కోరుతోంది. ఈ క్రమంలోనే స్పీకర్‌తో పాటు ఆమె పాటలు ప్లే చేసి అభిమానులతో కలిసి డ్యాన్స్ చేస్తూ కనిపించింది ఈ ఐటం బాంబ్. తాను స్పైడర్ ఉమన్ అని స్పైడర్ వెబ్‌లతో తన ప్రత్యర్థులను నాశనం చేస్తానని ‘బిగ్ బాస్‌’ను హెచ్చరించింది. ఇక మరొక వీడియోలో సల్మాన్ ఖాన్ పాడిన ‘బిగ్ బాస్’ థీమ్ సాంగ్‌లో రాఖీ సావంత్ డ్యాన్స్ చేసింది. రాఖీ చేసిన ఈ ఫన్నీ చేష్టలు చూసి నెటిజన్లు ‘బిగ్ బాస్’లో చాన్స్ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.

 ‘బిగ్ బాస్’ అంటే తనకు చాలా ఇష్టమని తెలిపింది. సిద్ధార్థ్ శుక్లా, షెహ్నాజ్ గిల్‌ను ‘బిగ్ బాస్’ రియాలిటీ షో లోకి ఆహ్వానించి, తనను ఎందుకు ఆహ్వానించలేదని రాకీ ప్రశ్నించింది. ప్రస్తుతం ‘బిగ్ బాస్’ ఓటీటీ సీజన్ ఓటింగ్ జరుగుతుండగా, కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. చూడాలి మరీ.. ఈ భామకు త్వరలోనైనా ‘బిగ్ బాస్’ ఓటీటీ చాన్స్ లభిస్తుందా? లేదా.. ఇకపోతే రాఖీ సావంత్ సోషల్ మీడియా వేదికగా తనకు సంబందించిన పోస్టులు చేస్తూనే ఉంటుంది. అవి చూసి నెటిజన్లు, ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తుంటారు.


మరింత సమాచారం తెలుసుకోండి: