పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేపు తన 50వ జన్మదినాన్ని జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోగా పరిచయం అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అనంతరం తొలిప్రేమ మూవీ భారీ సక్సెస్ తో యువతలో విశేషమైన క్రేజ్ దక్కించుకున్నారు. ఆపైన బద్రి సినిమాతో మరొక సిక్స్ కొట్టిన పవన్, తరువాత ఖుషి మూవీతో కెరీర్ పరంగా అతి పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సొంతం చేసుకున్నారు.

ఇక అక్కడి నుండి హీరోగా మరింత భారీ ఇమేజ్ తో దూసుకెళ్లిన పవర్ స్టార్ కెరీర్ పరంగా మధ్యలో మరెన్నో బ్లాక్ బస్టర్ సక్సెలు అందుకున్నారు. ఏడేళ్ళ క్రితం జనసేన పార్టీ స్థాపించిన పవన్, కొన్నేళ్ల రాజకీయ జీవితం తరువాత ఇటీవల వకీల్ సాబ్ మూవీ ద్వారా టాలీవుడ్ కి మళ్ళి నటుడిగా రీఎంట్రీకి ఇచ్చి దానితో సూపర్ హిట్ కొట్టారు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా రెండు సినిమాలు చేస్తుండగా త్వరలో మరొక రెండు సినిమాలు పట్టాలెక్కనున్నాయి. అయితే రేపు పవన్ బర్త్ డే సందర్భంగా మొత్తం ఆ నాలుగు సినిమాలకి సంబందించిన మూవీ యూనిట్స్ విడుదల చేయనున్న అప్ డేట్స్ రిలీజ్ టైం ని అనౌన్స్ చేసాయి.

కాగా వాటిలో కొద్దిసేపటి క్రితం, సాగర్ కె చంద్ర తీస్తున్న భీమ్లా నాయక్ ఫస్ట్ సాంగ్ లిరిక్స్ ని నిర్మాతలైన సితార ఎంటర్టైన్మెంట్స్ వారు ప్రకటించారు. కాగా దీని లిరికల్ సాంగ్ రేపు ఉదయం 11 గం. 16 నిమిషాలకు క్రిష్ చేతుల మీదుగా విడుదల కానుంది. ఆ తరువాత మధ్యాహ్నం 1 గం. 20 ని. లకు క్రిష్ తెరకెక్కిస్తున్న హరిహరవీరమల్లు నుండి ఒక పోస్టర్, అలానే 2 గం. 20 ని. లకు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మాతగా పవన్ నటించనున్న మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్, ఆపై movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ నటించనున్న మూవీ ప్రీ లుక్ పోస్టర్ ని సాయంత్రం 4 గం. 05 ని. లకు రిలీజ్ చేయనున్నారు. మొత్తంగా రేపు పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఈ వరుస సర్ప్రైజ్ లతో పెద్ద పండుగ ఖాయం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: