కమర్షియల్ యాక్షన్ ఎంటెర్టైనర్ చిరుత మూవీ తో టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ , ఆ సినిమాతో మంచి సక్సెస్ కొట్టారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా ని పూరి జగన్నాథ్ తెరకెక్కించగా నేహశర్మ హీరోయిన్ గా నటించారు. ఇక దీని తరువాత గీతా ఆర్ట్స్ బ్యానర్ పై రాజమౌళి తో చరణ్ చేసిన భారీ సినిమానే మగధీర. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని అందించగా దేవ్ గిల్ విలన్ గా కనిపించారు.

రెండు జన్మల కథగా ఆకట్టుకునే కథ, కథనాలతో భారీ యాక్షన్ తో కూడిన పీరియాడిక్ సోషల్ ఎంటర్టైనర్ గా దర్శకుడు రాజమౌళి దీనిని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. రామ్ చరణ్ ఈ సినిమాలో కనిపించిన రెండు పాత్రల్లో కూడా సూపర్ గా పెర్ఫార్మన్స్ కనబరిచారు. ఇక కాజల్ అయితే తన ఆకట్టుకునే అందచందాలతో పాటు మంచి అభినయం కూడా కనబరిచింది. ఈ సినిమాకి సాంగ్స్ తో పాటు భారీ యాక్షన్ సన్నివేశాలు, మరీ ముఖ్యంగా భైరవ వందమందిని చంపే సన్నివేశం పెద్ద ప్లస్ గా నిలిచాయి.

ఇక విడుదల తరువాత అప్పటివరకు టాలీవుడ్ లో ఉన్న అనేక రికార్డ్స్ ని బద్దలు కొట్టి సరికొత్త రికార్డ్స్ సృష్టించిన మగధీర గొప్ప విజయం తరువాత హీరోగా ఎంతో గొప్ప క్రేజ్ దక్కించుకున్నారు చరణ్. ఇందులో రావు రమేష్, శరత్ బాబు, సునీల్, బ్రహ్మానందం వంటి వారు కీలక పాత్రలు చేయగా దివంగత సీనియర్ నటుడు శ్రీహరి కూడా ఇందులో రెండు పాత్రల్లో కనిపిస్తారు. మొత్తంగా అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచి రిలీజ్ తరువాత సూపర్ సక్సెస్ అందుకున్న మగధీర మూవీని తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: