తమిళ నాట లేడీ ఓరియంటెడ్ సినిమాలు అంటే ముందుగా గుర్తుకు వచ్చే కథానాయక లేడీ సూపర్ స్టార్ నయన తార, అలాంటి నయన తార ఇప్పటి వరకు ఎన్నో లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి సూపర్ హిట్ లు అందుకుంది. తాజా గా కూడా నయనతార మరో లేడీ ఓరియంటెడ్ సినిమాకు ఓకే చెప్పింది. తాజా గా ఆ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది. ఈ సిని మా కు కనెక్ట్ అనే టైటిల్ ను ఖరారు చేసారు. నిన్న నయన తార పుట్టిన రోజు సందర్భం గా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను బయటకు వదిలారు.

ఈ సినిమాకు అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించబోతున్నాడు. ఇప్పటికే అశ్విన్ శరవణన్, నయన తార ప్రధాన పాత్రలో తెరకెక్కిన మాయ అనే హర్రర్ థ్రిల్లర్ సినిమా ను దర్శకత్వం వహించాడు. 2015 లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని దక్కించుకుంది. ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగు లో కూడా మంచి విజయాన్ని సాధించింది. ఇలా ఇప్పటికే నయనతార తో ఒక హర్రర్ సినిమాను తీసి విజయాన్ని అందుకున్న ఈ దర్శకుడు మరొక సారి నయనతార తో సినిమాను తెరకెక్కించబోతున్నాడు. ప్రస్తుతం నయనతారసినిమా తో పాటు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరో గా మోహన్ రాజా దర్శకత్వం లో మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ కు తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ సినిమాలో కూడా నటించనుంది. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా నిన్న నయనతార పుట్టిన రోజు సందర్భం గా చిత్ర బృందం అఫీషియల్ గా తెలియజేసింది. ఇలా నయన తార ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్  సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: