సోషల్ మీడియా ద్వారా తమ టాలెంట్ ను చూయించి..పాపులర్ అయిన వాళ్లు చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో హారిక..అదేనండి దేత్తడి హారిక  అలియాస్ అలేఖ్య హారిక  కూడా ఒక్కరు. యూట్యూబ్‌ చానల్ 'దేత్తడి' ద్వారా తెలుగువారందరికి దగ్గరైన ఈ తెలుగు అమ్మాయి.. వెబ్ సిరీస్‌ లతో కూడా మనలని మెప్పించ్చింది. ముఖ్యంగా హారిక తెలంగాణ యాసతో మాట్లాడుతూ అదరగొడుతుంది. సోషల్ మీడియాలో ఈమెకు విపరీతమైన ఫాలోయింగ్ కూడా ఉంది. నిజానికి హారిక అమెజాన్ కంపెనీలో  జాబ్ చేసేది. కానీ ఆమె  తనలోని టాలెంట్ ను అందరికి  చూపించడానికి  ఉద్యోగాన్ని సైతం వదిలేసి మరీ ఈ రంగలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం హారిక చేసే 'దేత్తడి' యూట్యూబ్ ఛానెల్‌కు  10 లక్షలకు పైగా  సబ్‌స్క్రైబర్లు ఉన్నారంటే ఆమెకు ఉన్న క్రేజ్ ఏంటో మనం అర్ధం చేసుకోవచ్చు.

ఇక ఆ క్రేజ్ తోనే  తెలుగులో అతి పెద్ద రియాటీ షో అయిన  బిగ్ బాస్ సీజన్ 4లోకి వెళ్లింది.ఇక బిగ్ బాస్ హౌస్ లో ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. తన టాలెంట్ తో,ఆట తీరుతో టాస్క్  లల్లో చురుగ్గా పాల్గోంటూ టాప్ 5 లో ఒక్కరుగా నిలిచారు. అంతేకాదు బిగ్ బాస్ హౌస్ లో తోటి కంటెస్టేంట్ అభి తో క్లోజ్ గా ఉండడం చూసి..అభిమానులు సైతం వీళ్ళు ప్రేమించుకుంటున్నారేమో అని అనిపించుకునేలా చేసుకుంది. సీన్ కట్ చేస్తే..హౌస్ నుండి బయటకు వచ్చాక వీళ్లు మొహాలు కూడా చూసుకోవడం లేదు. ప్రస్తుతం హారిక ఓ రెండు సినిమాల్లో నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.


తాజాగా హారిక తల్లి యూట్యూబ్ లో చేసిన హోం టూర్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఆ వీడియోలో వాళ్ల అమ్మ ఇల్లు మొత్తం చూయిస్తుంది. హారిక ఇప్పటి వరకు గెలుచుకున్న అవార్డులన్నీ ఆమె ఈ వీడియోలో చూయించారు. అంతేకాదు హారికకు పెయింటింగ్ అంటే ఇష్టమని కూడా చెప్పుకొచ్చారు. ఇక వీళ్ళు ఉంటున్న ఈ ఇళ్లు ఖరీదు దాదాపు కోటి రుపాయాలు ఉండచ్చని నెటిజన్స్ భావిస్తున్నారు. మొత్తానికి హారిక ఇల్లు ఓ ఇంద్ర భవనంలా ఉంది అంటున్నారు ఆ వీడియో చూసిన నెటిజన్స్.








 

మరింత సమాచారం తెలుసుకోండి: