ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి చెందడంతో పాటు తెలుగు సినిమా పరిశ్రమ విషాదంలో కూరుకుపోయింది. ఎక్కడో అనకాపల్లి లో జన్మించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి కెరీర్ పరంగా అంచెలంచెలుగా ఎదిగారు. ఆయన కెరీర్ ప్రారంభంలో ఎన్నో కష్టాలు పడ్డారు. ఎప్పుడు అయితే ఆయ‌న సిరివెన్నెల సీతారామ శాస్త్రిగా మారారో అప్పటి నుంచి ఆయన చనిపోయే వరకూ అదే పేరుతో పాపుల‌ర్ అయ్యారు. ఆయన కెరీర్ విషయానికి వస్తే ఆయన కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన జన్మభూమి జ‌న్మ‌భూమిచ్చా సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అయ్యారు.

అయితే ఆ సినిమా అంతగా సక్సెస్ కాకపోవడంతో సిరివెన్నెల కు పేరు రాలేదు. అయితే కె.విశ్వనాథ్ దర్శకత్వంలో 1986 లో వచ్చిన సిరివెన్నెల సినిమా లోని అన్ని పాటలను సీతారామశాస్త్రి రాశారు. ఈ సినిమాలో అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమా హిట్ అయ్యాక అప్పటివరకు ఉన్న సీతారామశాస్త్రి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గా మారిపోయారు. అప్పటి నుంచి ఆయన పేరు ఇప్పటివరకు సిరివెన్నెల సీతారామశాస్త్రి గా మారిపోయింది.

ఆ సినిమాలోని ఆది భిక్షువు వాడినేది ఏది కోరేది అనే పాట ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఆ తర్వాత సిరివెన్నెల స్వర్ణకమలం - సంసారం ఒక చదరంగం - శృతిలయలు - ఇంద్రుడు చంద్రుడు - నిన్నే పెళ్లాడతా - గౌతమీపుత్ర శాతకర్ణి - మురారి - ఒక్కడు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సూపర్డూపర్ హిట్ సినిమాలకు పాటలు రాశారు.

రాజమౌళి దర్శకత్వంలో వచ్చే సంక్రాంతికి రాబోతున్న ఆర్ఆర్ సినిమాకు కూడా ఆయన పాట రాశారు. సిరివెన్నెల ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఏ చదివారు. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన గాయం సినిమా లో ఆయన నటించారు. ఎన్నో అవార్డులు అందుకున్న సిరివెన్నెల సీతారామశాస్త్రి తన 37 ఏళ్ల సినీ ప్రస్థానంలో మూడు వేలకు పైగా పాటలు రచించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: