దక్షిణాది చిత్ర పరిశ్రమ లో హీరోయిన్ శ్రేయ కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో తెలుగు చిత్ర పరిశ్రమలో తన అందాలతో అందరిని  కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ. ఎన్నో గ్లామర్ పాత్రల్లో నటించి  తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. ఇక స్టార్ హీరోల సినిమాల్లో నటించి ఎంతో గుర్తింపు సంపాదించుకుంది. దాదాపు దశాబ్ద కాలానికి పైగా నే తెలుగు చిత్ర పరిశ్రమలో సార్ హీరోయిన్ గా తన హవా నడిపించింది శ్రీయ శరన్. కేవలం యువ హీరోల సరసన కాదు సీనియర్ హీరోల సరసన కూడా నటించి  అందరికీ పర్ఫెక్ట్ జోడి గా పేరు తెచ్చుకుంది.



 అంతేకాదండోయ్ ఎన్నో ఐటమ్ సాంగ్స్ లో కూడా హాట్ హాట్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేసి అందరినీ పగటి కల ల్లోకి నెట్టింది ఈ ముద్దుగుమ్మ.. అయితే ఆ తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయింది అని చెప్పాలి. కానీ ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైన శ్రియ శరన్. గమనం అనే సినిమాలో  ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఎన్నో ఏళ్ల తర్వాత శ్రియ శరణ్ మళ్లీ రీ ఎంట్రీ ఇస్తూ ఉండటంతో అభిమానులందరూ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.



 అయితే ఇటీవలే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఇక ఈవెంట్కి చీఫ్ గెస్ట్ గా యువ హీరో శర్వానంద్ వచ్చాడు. ఈ సందర్భంగా శ్రీయ పై ప్రశంసలు కురిపించాడు. హీరోయిన్ శ్రియ సంతోషం సినిమాలో ఎలా కనిపించిందో ఇప్పుడు కూడా అంతే   అందంగా ఉంది అంటూ శర్వానంద్ చెప్పుకొచ్చాడు. గమనం కథను నాకు డైరెక్టర్ జ్ఞానశేఖర్ ఇంతకుముందే వినిపించాడు అంటూ తెలిపాడు శర్వానంద్. అయితే ఈ సినిమా స్టొరీ చాలా నచ్చిందని కానీ కొన్ని కారణాలవల్ల ఈ సినిమాలో నటించలేక పోయాను అంటూ శర్వానంద్ చెప్పుకొచ్చాడు.. ఇక ఇప్పుడు ఈ సినిమాలో భాగస్వామి కావాలని అనిపిస్తోంది అంటూ తెలిపాడు. కాగా డిసెంబర్ 10వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: