టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి తీసిన లేటెస్ట్ సినిమా ఆర్ఆర్ఆర్ పై కేవలం మన ఇండియా మాత్రమే కాదు, యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా లవర్స్ లో ఎంతటి భారీ అంచనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఫస్ట్ టైం కల్సి నటిస్తున్న ఈ సినిమాని దానయ్య ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. కీరవాణి మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ భారీ పాన్ ఇండియా మూవీకి కేకే సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫి అందించగా సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాసారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టీజర్స్, సాంగ్స్, థియేట్రికల్ ట్రైలర్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుని సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెంచాయి.

ముఖ్యంగా మెగా, నందమూరి ఫ్యాన్స్ లో అయితే ఈ మూవీ పై ఆకాశమే హద్దుగా అంచనాలు ఉన్నాయి. ఇక ఈ భారీ మూవీ ని 2022, జనవరి 7 న యూనిట్ విడుదల చేయనున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆర్ఆర్ఆర్ వంటి భారీ ప్రతిష్టాత్మక సినిమా రిలీజ్ కి తన సినిమా ఇబ్బంది కాకూడదని భావించిన మహేష్, అప్పటికే సర్కారు వారి పాట మూవీని సంక్రాంతికి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మహేష్, అనంతరం ఆర్ఆర్ఆర్ టీమ్ వారి అభ్యర్ధన మేరకు దానిని ఏప్రిల్ 1కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ విషయమై కొద్దిసేపటి క్రితం దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ఒక ట్వీట్ చేస్తూ ప్రత్యేకంగా మహేష్ కి కృతజ్ఞతలు చెప్పారు.

ముందుగా తమ సినిమా వస్తుందని తెలిసి, మంచి మనసుతో అర్ధం చేసుకుని తమ సినిమాని వాయిదా వేసిన మహేష్ కి ప్రత్యేకంగా థాంక్స్ చెప్పిన రాజమౌళి, ఇటువంటి ఆరోగ్యరకరమైన వాతావరణానికి కారకులై చక్కని నిర్ణయం తీసుకున్న నా హీరో మహేష్ బాబు అంటూ రాజమౌళి ట్వీట్ చేయడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ లో ఆనందం విపరీతంగా వెల్లివిరుస్తోంది. కాగా అటు సంక్రాంతికి అనుకున్న భీమ్లా నాయక్ నాయక్ కూడా నేడు తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో ఆ మూవీ టీమ్ కి, పవన్ కళ్యాణ్ కి కూడా థాంక్స్ చెప్పారు రాజమౌళి. మరి జనవరి 7న భారీ స్థాయిలో రిలీజ్ కానున్న ఆర్ఆర్ఆర్ ఎంత మేర సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: