ప్రస్తుతం మన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ భారత దేశం మొత్తం కూడా ఆర్ఆర్ ఆర్ మూవీ మేనియా నడుస్తుంది. రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, చరణ్ కలిసి నటించిన ఈ సినిమాని డివివి దానయ్య దాదాపుగా రూ.550 కోట్లు ఖర్చుతో నిర్మించగా ఎన్టీఆర్ ఇందులో కొమరం భీంగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. టాలీవుడ్ తో పాటు హాలీవుడ్ సహా పలు ఇతర పరిశ్రమలకు చెందిన పలువురు నటులు కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్, టీజర్స్ అన్ని అందరి నుండి మంచి అప్లాజ్ అందుకుని మూవీపై భారీ అంచనాలు క్రియేట్ చేసాయి.

కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాకి సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా 1920ల సమయంలో సాగే కథగా వాస్తవికతకు కొంత కల్పితం జోడించి రాజమౌళి తీసిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ ఖాయం అని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తుండగా దీని పై అటు మెగా నందమూరి ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇక రేపు ఈ సినిమా నుండి కొమరం బీమ్ పై సాగే ఎమోషనల్ సాంగ్ తో పాటు మరొక రెండు రోజుల్లో అల్లూరి సీతారామరాజు పై సాగే సాంగ్ ని కూడా యూనిట్ రిలీజ్ చేయనుంది.

అయితే విషయం ఏమిటంటే, ఈ సినిమా నుండి మరొక వారం రోజుల్లో రెండవ ట్రైలర్ రిలీజ్ కానుందనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. ఇప్పటికే ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ కి బాగా రెస్పాన్స్ రావడంతో ఒకటిన్నర నిమిషం పాటు సాగే మరొక ట్రైలర్ ని యూనిట్ రిలీజ్ చేయనుందని, త్వరలో దానిపై అనౌన్స్ మెంట్ రానుందని సమాచారం. మరి ఇదే కనుక నిజం అయితే ఆర్ ఆర్ ఆర్ ఫ్యాన్స్ కి ఇది పండుగ న్యూస్ అనే చెప్పాలి. కాగా ఈ సినిమాని 2022 జనవరి 7న ఎంతో భారీ ఎత్తున దాదాపుగా 13000 థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. మరి ఎప్పటినుండో ప్రేక్షకాభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న ఈ సినిమా ఎంత మేర సక్సెస్ అవుతుందో తెలియాలి అంటే మరికొద్దిరోజుల వరకు ఓపిక పట్టాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: