ప్రభాస్, పూజా హెగ్డే కలయికలో తెరకెక్కిన లేటెస్ట్ సినిమా రాధేశ్యామ్. యువి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ కలిసి నిర్మించిన ఈ సినిమాకి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించగా ఇతర పాత్రల్లో జగపతి బాబు, జయరాం, షాషా ఛత్రి, మురళి శర్మ, భాగ్యశ్రీ నటించారు. పాన్ ఇండియా సినిమాగా ఎంతో భారీ వ్యయంతో తెరకెక్కిన ఈ సినిమాకి మనోజ్ పరమహంస ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించగా సౌత్ వెర్షన్స్ కి జస్టిన్ ప్రభాకరన్, అలానే హిందీ కి మన్నన్ మిథూన్ సంగీతం అందించారు.

ఇటీవల ఈ సినిమాలోని సాంగ్స్ యూట్యూబ్ లో రిలీజ్ అయి అందరి నుండి మంచి స్పందన అందుకున్నాయి. ప్రభాస్, విక్రమాదిత్య గా, అలానే పూజా హెగ్డే ప్రేరణ గా నటిస్తున్న ఈ రొమాంటిక్, ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ థియేట్రికల్ ట్రైలర్ నిన్న రాత్రి రిలీజ్ అయింది. ఎంతో భారీ ఎత్తున నిన్న జరిగిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా ట్రైలర్ ని రిలీజ్ చేసారు. ప్రభాస్ తో ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్న దర్శకులతో పాటు పలువురు దిగ్గజ ప్రముఖులు అతిథులుగా విచ్చేసిన రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంతో వైభవంగా జరిగింది.

అయితే ట్రైలర్ రిలీజ్ తరువాత సినిమాపై అందరిలో ఇప్పటివరకు ఉన్న అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి అనే చెప్పాలి. ముఖ్యంగా ట్రైలర్ లో లవ్, రొమాంటిక్, యాక్షన్, ఎమోషనల్ సీన్స్ ని బట్టి చూస్తే రాధేశ్యామ్ రిలీజ్ తరువాత తప్పకుండా అందరినీ ఆకట్టుకుంటుందని, మరీ ముఖ్యంగా ట్రైలర్ చివర్లో కనిపించిన షిప్ మునిగిపోయే విజువల్స్ ని బట్టి చూస్తుంటే ఈ సినిమా గతంలో వచ్చిన టైటానిక్ ని గుర్తు చేస్తోందని కొందరు అంటున్నారు. అయితే సినిమాలో ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ కోరుకున్న అంశాలు అన్ని పుష్కలంగా ఉండడంతో పాటు సినిమాలోని లవ్, ఎమోషన్ తప్పకుండా నాటి టైటానిక్ మాదిరిగా అందరి మనస్సులో నిలిచిపోవడం ఖాయం అనేది ఇన్నర్ వర్గాల టాక్. కాగా ఈ సినిమా జనవరి 14 న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: