టాలీవుడ్‌, బాలీవుడ్ ఇండ‌స్ట్రీలో న‌టీ ర‌వీనా టాండ‌న్ గురించి ఇక ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌రే లేదు. ఈమె తొలిసారి టాలీవుడ్ చిత్రాల‌లో న‌టించిన త‌రువాత బాలీవుడ్ ఇండ‌స్ట్రీ వైపున‌కు వెళ్లింది. ఇలా బాలీవుడ్‌, టాలీవుడ్ ల‌లో ప‌లు చిత్రాల‌లో న‌టించిన ఎంతో మంది గుర్తింపు సంపాదించుకున్న ర‌వీనా గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నే లేదు. ఎన్నో సినిమాల‌లో న‌టించిన‌ప్ప‌టికీ షూటింగ్ స‌మ‌యంలో కొంత మందితో క‌లిసి న‌టించాలంటే త‌న‌కు చాలా భ‌యం అని ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చారు.

అస‌లు ఆమెకు ఎవ‌రితో న‌టించాల‌నే విష‌యానికొస్తే.. ఏ సినిమా షూటింగ్ లొకేష‌న్‌లో అయినా ఒక స్క్రిప్ట్ ఇచ్చి పూర్తిగా అందుకు అనుగుణంగా ఎలా న‌టించాలో ముందుగానే ప్రిపేర్ అయి ఉంటాం. కానీ కొంత మంది ద‌ర్శ‌కులు క‌థ ఒక‌టి చెప్పి తీరా షూటింగ్ స‌మ‌యంలో క‌థ‌లో మార్పులు చేస్తుంటారు. ఇలా ఉన్న‌ట్టుండి ఒక్క‌సారిగా మార్పులు చేసే స‌రికి ఆ డైరెక్ట‌ర్ మైండ్‌లో ఏముందో తెలియ‌క ఎంతో స‌త‌మ‌త‌మ‌వుతూ.. కొన్నిసార్లు భావోద్వేగ ప‌రిస్థితులు త‌లెత్తుతాయ‌ని అలాంటి స‌మ‌యంలో న‌టించాలంటే చాలా భ‌యంగా ఉంటుంద‌ని..  హీరోయిన్ ర‌వీనా టాండ‌న్‌ ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు.

ఇక ఈ హీరోయిన్‌కు మ‌ద్ద‌తుగా మ‌రొక హీరోయిన్ కూడా వ‌త్తాసు ప‌లికారు. తెలుగు ఇండ‌స్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న  తాప్సీ బాలీవుడ్ ఇండ‌స్ట్రీలో వ‌ర‌స సినిమాల‌తో దూసుకెళ్లుతుంది. ఈ త‌రుణంలోనే ఈ విష‌యంపై స్పందించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. తొలుత వారొక‌టి అనుకుంటారు అని, సెట్‌లో మ‌రొక‌టి.. అక‌స్మాత్తుగా మార్పులు చోటు చేసుకుంటాయ‌ని చెప్పారు. మేము చ‌ర్చించుకున్న పాత్ర విధానం ఇది కాద‌నే భావ‌న‌లో మేము ఉండగా.. ద‌ర్శ‌కుడు చెప్పిన‌విధంగానే న‌టించాల‌ని పేర్కొంటారు. ఇక వీరి సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం ర‌వీనాటాండ‌న్  హాట్ స్టార్ సిరిస్ అర‌ణ్య‌క్ మంచి టాక్ తెచ్చుకుంది. అదేవిధంగా తాప్సీ వ‌రుస సినిమాల‌తో బాలీవుడ్ ఇండ‌స్ట్రీలో బిజీగా ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: