టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ ఒకప్పుడు ప్రతి ఏడాది సంక్రాంతి బరిలో తన సినిమా తప్పకుండా ఉండేలా చూసుకునే వారు. తన కెరీర్ లో అనేక సినిమాలు సంక్రాంతి సీజన్ లో రిలీజ్ చేసి టాలీవుడ్ లో సంక్రాంతి మొనగాడుగా నిలిచి అప్పట్లో పెద్ద రికార్డులు సొంతం చేసుకున్నారు కృష్ణ. ఆ తరువాత ఆయన చిన్న తనయుడు మహేష్ బాబు కూడా తన కెరీర్ లో కొన్ని సినిమాలు సంక్రాంతి కి రిలీజ్ చేసి మంచి విజయాలు సొంతం చేసుకున్నారు.

మొదటగా మహేష్ కెరీర్ ఐదవ సినిమాగా రిలీజ్ అయిన భారీ కౌబాయ్ మూవీ టక్కరి దొంగ 2002 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది. ఆ సినిమాలో మహేష్ పెర్ఫార్మన్స్ కి బాగా పేరు లభించినప్పటికీ సినిమా మాత్రం ఆశించిన స్థాయి సక్సెస్ కాలేదు. అనంతరం ఏడవ సినిమా ఒక్కడు సంక్రాంతికి రిలీజ్ అయి అప్పట్లో అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ కొట్టింది. గుణశేఖర్ తీసిన ఆ మూవీతో మహేష్ క్రేజ్, మార్కెట్ రేంజి ఊహించనంత స్థాయికి పెరిగింది. ఆ తరువాత పూరి జగన్నాథ్ తీసిన బిజినెస్ మ్యాన్ మూవీ కూడా సంక్రాంతి కి రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ కొట్టింది.

ఆ సినిమాలో మహేష్ వన్ మ్యాన్ షోకి ప్రేక్షకాభిమానులు బ్రహ్మరథం పట్టారు. ఆపైన వెంకటేష్ తో కలిసి తొలిసారిగా సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు వంటి భారీ మల్టీస్టారర్ మూవీ చేసిన మహేష్ దానితో కూడా సూపర్ హిట్ ని దక్కించుకున్నారు. ఈ సినిమాలో సమంత, అంజలి హీరోయిన్స్ గా నటించారు. ఆ తరువాత సుకుమార్ తీసిన వన్ నేనొక్కడినే అనే సైకలాజికల్ థ్రిల్లర్ మూవీలో నటించిన మహేష్, సంక్రాంతికి రిలీజ్ అయిన ఆ మూవీతో పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఇక రెండేళ్ల క్రితం అనిల్ రావిపూడి తీసిన సరిలేరు నీకెవ్వరు మూవీతో మరొక్కసారి సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్, దానితో పెద్ద విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా ఒకప్పటి నటి విజయశాంతి కీలక పాత్ర చేసారు. ఈ విధంగా తన కెరీర్ లో సంక్రాంతికి విడుదలైన సినిమాలతో పెద్ద విజయాలు అందుకుని తండ్రి మాదిరిగా సంక్రాంతి సూపర్ స్టార్ గా నిలిచారు మహేష్ బాబు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: