

కాగా రాజా డీలక్స్ పేరుతో మంచి హారర్ డ్రామా గా సాగె యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ స్టోరీ సిద్ధం చేసిన దర్శకుడు మారుతి మరొక రెండు రోజుల్లో దానిని ప్రభాస్ కి వినిపించనున్నారనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. తన స్టైల్ తో పాటు ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకునే అన్ని కమర్షియల్ హంగులు ఈ సినిమాలో ఉన్నాయని, ఒకవేళ ప్రభాస్ ఈ సినిమా కథని ఒప్పుకుంటే త్వరలో ఈ మూవీని పట్టాలెక్కించి సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారట మారుతీ. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ప్రకారం హర్రర్ జానర్ లో సాగె కామెడీ ఎంటర్టైనర్ స్టోరీ కి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా, అటువంటి కథ ప్రభాస్ కి ఎంత వరకు సూట్ అవుతుంది, నిజంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుందా అనే విషయాలపై పూర్తి క్లారిటీ రావాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.