దర్శకుడు ఎస్ జే సూర్య దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా గత కొన్ని సంవత్సరాల క్రితం నాని సినిమా తెరకెక్కిన విషయం అందరికి తెలిసిందే..అయితే బాక్సాఫీసు వద్ద అనుకున్నంత స్థాయిలో నాని సినిమా విజయాన్ని అందుకోలేకపోయింది.. కానీ ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు చిన్నపిల్లాడిలా నటించి అందరినీ బాగా అలరించడంతో చిన్నపిల్లలు ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు.. ఈ సినిమా ని చూడడానికి చిన్న పిల్లలు తమ పేరెంట్స్ తో కలిసి సినిమాను కొంత వరకు సక్సెస్ చేశారు. ఇకపోతే దాదాపు రెండు సంవత్సరాల క్రిందట స్పైడర్ సినిమాలో మహేష్ బాబు హీరోగా నటించగా దర్శకుడు ఎస్ జే సూర్య విలన్ పాత్ర పోషించి అందరినీ భయపెట్టారు..అయినా కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్న రేంజ్ లో అందుకోలేకపోయింది.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఎస్.జె.సూర్య.. మహేష్ బాబు గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలియ చేయడమే కాకుండా మహేష్ బాబు గురించి చెప్పాలంటే ఈ ఒక్క సీన్ చాలు అంటూ ఆయనను ఆకాశానికి ఎత్తేశారు.. ఇకపోతే మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్న సినిమాలు  సరిలేరు నీకెవ్వరు, మహర్షి సినిమాలను నేను చూశాను. ముఖ్యంగా మహర్షి సినిమాలో మహేష్ బాబు నటన, సినిమా కథనం నాకు చాలా బాగా నచ్చాయి అనే ఎస్ జే సూర్య తెలిపారు..
మహర్షి సినిమాలో మహేష్ బాబు అదరగొడితే సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఆమె నటన సూపర్ గా ఉంది అంటూ పొగడ్తలతో ముంచెత్తారు.  సరిలేరు నీకెవ్వరు సినిమా లో రైలు సన్నివేశంలో మహేష్ బాబు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు అని ఆయన తెలిపాడు.. ఇక ట్రైన్ ఎపిసోడ్ లో మహేష్ బాబు నటించలేదు అని నిజజీవితంలో ఎలా ఉంటారో అలాగే అక్కడ కనిపించారు అని సూర్య తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: