బిగ్ బాస్ షో లో అలరించిన వారంతా ఇప్పుడు బయట తెగ హంగామా చేస్తున్నారు. అప్పుడు ఇంట్లో కలిసి ఉన్న గ్రూప్ బయట కూడా కలుస్తూ ఎంజాయ్ చెస్తున్నారు. చాలా మంది ఇప్పుడు ఇలానే బయట కలుస్తూ వారి మీటింగ్ కు సంబంధించిన వీడియో లను సోషల్ మీడియాలో పోస్ట్ చెస్తున్నారు.. అవి కాస్త నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పుడు సింగర్ నోయల్ కు సంబంధించిన వీడియో ఒకటి హల్ చల్ చెస్తుంది.. అది కూడా సీక్రెట్‌ వీడియో అంటూ ప్రచారం జరుగుతుంది. ఆ మ్యాటర్ ఏంటో వివరాల్లొకి వెళ్ళి తెలుసుకుందాం..


బిగ్ బాస్ కంటెస్టెంట్ లు అందరినీ ఒకే చోట కు తీసుకువచ్చి ఒక పెద్ద ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్న సంగతి అందరికి తెలుసు.. గత ఐదు సీజన్లలో పాల్గొన్న వారిని మాత్రమే ఇందుకు అర్హులు.. వాళ్ళు మాత్రమే వీడియో షూట్ చెస్తున్నారని తెలుస్తుంది.మధ్య మధ్యలో బ్రేక్ రావడంతో బిగ్ బాస్ కంటెస్టెంట్ లు ఫన్నీ వీడియోలు, డాన్స్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే పలువురు బిగ్ బాస్ కంటెస్టెంట్ లు ఈవెంట్ మధ్యలో చేస్తున్న కొన్ని వీడియో లను సోషల్ మీడియాలో షేర్ చేశారు.


ఇకపోతే రెండవ సీజన్ కంటెస్టెంట్ లు అయిన రోల్ రైడా, భాను శ్రీ లు దగ్గరయ్యారు. ఇక బిగ్ బాస్ షో ద్వారా దగ్గరైన వీరిద్దరూ అప్పటి నుంచి ఏ ఒక్క ఈవెంట్ జరిగినా ఎక్కడ కనిపించినా కూడా ఇద్దరు కలిసి ఉంటారు.. వాళ్ళు అంత మంచిగా ఫ్రెండ్స్ అయ్యారు.ఇది ఇలా ఉండగా.. షూటింగ్ నిర్విరామంగా జరుగుతుండడంతో కొందరు తినడానికి ఇంట్లో నుంచి భోజనం తెచ్చుకుంటున్నారు, ఇంకొందరు బయటి నుంచి ఆర్డర్ తెప్పించుకోగా ,కొందరు అక్కడే వుండే ఫుడ్ ను తింటున్నారు.ఈ క్రమంలో రైడా పై భాను మండిపడుతూ వుంటుంది. అది నోయల్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది చూసిన భాను కామెంట్ చెస్తుంది. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: