
ప్రారంభం నాటి నుండి అందరిలో మంచి అంచనాలు పెంచిన ఈ సినిమా ఇప్పటికే కొంత భాగం షూట్ జరుపుకోగా తదుపరి షెడ్యూల్ ని ఏప్రిల్ లో నిర్వహించనున్నట్లు టాక్. అయితే అసలు విషయం ఏమిటంటే దాదాపుగా పదేళ్ల క్రితం మాస్ కమర్షియల్ సినిమాల దర్శకుడు హరీష్ శంకర్ తో చేసిన గబ్బర్ సింగ్ సినిమాతో భారీ హిట్ సొంతం చేసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అతి త్వరలో ఆయనతోనే మరొక సినిమా చేయనున్న విషయం తెల్సిందే. మైత్రి మూవీ మేకర్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమాకి భవదీయుడు భగత్ సింగ్ టైటిల్ ని ఇటీవల ఖరారు చేసిన యూనిట్, మే లో దీనిని పట్టాలెక్కించనున్నట్లు టాక్. ఇప్పటికే ఈ భారీ సినిమా స్క్రిప్ట్ పై కసరత్తు చేస్తున్న దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమాలో పవన్ క్యారెక్టర్ ని ఎంతో పవర్ఫుల్ గా రాసుకున్నారట. అలానే మిగతా ఇతర స్టార్ క్యాస్టింగ్ తో పాటు సాంకేతిక నిపుణులని సైతం ఎంతో జాగ్రత్తగా ఎంపిక చేస్తున్నారట.
