టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన ఆచార్య సినిమా షూటింగ్ పనులు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా విడుదల కాకముందే మరికొన్ని వరుస ప్రాజెక్టులు లైన్ లో పెడుతున్నాడు చిరు. యువ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. ఇక మెగాస్టార్ నటిస్తున్న సినిమాల్లో 'గాడ్ ఫాదర్' సినిమా కూడా ఒకటి. ఇప్పుడు ఫ్యాన్స్ చూపంతా ఈ సినిమా పైనే ఉంది. మలయాళంలో విజయం సాధించిన లూసీఫర్ చిత్రానికి తెలుగు రీమేక్ గా వస్తున్న ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 

ఇక ఈ సినిమాలో పలు అగ్ర నటీ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా తాజాగా మొదలుపెట్టారు. అయితే సల్మాన్ ఖాన్ తో పాటు ప్రజా గాయకుడు గద్దర్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే గాడ్ఫాదర్ సినిమాలో గద్దర్ చేయబోయేది ఎలాంటి పాత్ర అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తి రేకెత్తిస్తోంది. అయితే తాజాగా ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గాడ్ఫాదర్ చిత్రంలోని తన పాత్రకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు గద్దర్.

చిరంజీవితో కలిసి నటించడం ఓ కొత్త అనుభూతిని కలిగించింది అని చెప్పుకొచ్చారు. కాగా గాడ్ ఫాదర్ సినిమాలో గద్దర్ చిరంజీవి తండ్రికి స్నేహితుని పాత్రలో  కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కథ ప్రకారం చిరంజీవి జైలుకు వెళతాడు. అక్కడ తన తండ్రి స్నేహితుడైన గద్దర్ ను కలుసుకుంటాడు.ఈ నేపథ్యంలో చిరంజీవి తండ్రికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను గద్దర్ పంచుకుంటాడు. అంతేకాదు ఈ సినిమాలో ఆయన ఓ విప్లవ చైతన్య గీతాలు కళాకారుడిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో నటించినందుకు గానూ ఆయనకు మంచి పారితోషికం కూడా ఇచ్చారని తాజా ఇంటర్వ్యూలో గద్దర్ తన ఆనందాన్ని వ్యక్తపరిచారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: