తొలిసారిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్,మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన భారీ యాక్షన్ పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్. దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తీసిన ఈ భారీ మూవీని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య దాదాపుగా రూ. 550 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించగా కీరవాణి సంగీతాన్ని, సాయి మాధవ్ బుర్రా మాటలని అందించారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ లో మొదటి నుండి కూడా భారీ అంచనాలు ఏర్పరిచిన ఈ సినిమా కొద్దిరోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ స్పందనని అందుకుంది.

కొమురం భీంగా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ కనిపించిన ఈ సినిమా భారీ యాక్షన్, ఎమోషనల్ అంశాలతో తెరకెక్కింది. ఒలీవియా మోరిస్, అలియా భట్ హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్లకు పైగా కలెక్షన్ ని సొంతం చేసుకుని పలు ఏరియాల్లో బాగానే కొనసాగుతోంది. అయితే ఈ సినిమా స్వాతంత్రోద్యమ నేపథ్యంలో 1920 ల కాలం నాటి కథగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ లో పలువురు హాలీవుడ్ నటులు సైతం కీలక పాత్రలు చేసారు.

కాగా సినిమాలో ఆ హాలీవుడ్ నటులు పలికిన కొన్ని ఇంగ్లీష్ డైలాగులని తెలుగు హీరోలైన నవదీప్, రానా డబ్బింగ్ అందించడం జరిగింది. వాస్తవానికి సినిమా మొత్తంలోని ఇంగ్లీష్ డైలాగులకు రానా, నవదీప్ డబ్బింగ్ ఉండదు, కేవలం కొన్ని కీలక సీన్స్ కి మాత్రమే వారు తమ వాయిస్ అందించారు. ఆ విధంగా అటు రానా, ఇటు నవదీప్ ఇద్దరూ కూడా ఆర్ఆర్ఆర్ లో కనిపించని తెరవెనుక హీరోలు అని అంటున్నారు విశ్లేషకులు. మొత్తంగా ఈ మూవీ మంచి విజయం అందుకోవడంతో అటు ఎన్టీఆర్, ఇటు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఇద్దరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీని తరువాత త్వరలో ఎన్టీఆర్, కొరటాల శివ తో నెక్స్ట్ మూవీ చేయనుండగా, ఇప్పటికే రామ్ చరణ్ తదుపరి శంకర్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: