తెలుగు బిగ్ బాస్ నాన్ స్టాప్ లో బిందు మాధవి జోరు అయితే అసలు మామూలుగా లేదు. ఆమె గతంలో రన్నరప్ గా నిలిచిన అఖిల్ కు ఇప్పుడు చుక్కలు చూపిస్తుంది.అతడితో ఢీ అంటే ఢీ అన్నట్లుగా ఆమె గేమ్ ను ఆడుతోంది.ఇక ప్రతి విషయంలో కూడా అఖిల్ కు ఆమె తీవ్రమైన పోటీ ఇస్తూ ప్రతి ఒక్కరితో కూడా ఆకట్టుకునే విధంగా తన గేమ్ ను కొనసాగిస్తూ ఉంది.ఇక ఇటీవల ఒక ఎపిసోడ్ లో మాట్లాడుతూ తాను లవ్ ఫెయిల్యూర్ అంటూ ప్రకటించిన సంగతి తెల్సిందే. తెలుగు అమ్మాయి అయిన బిందు మాధవి తెలుగు లో కంటే తమిళంలో ఎక్కువ విజయాలను దక్కించుకుంది. కాబట్టి తమిళంలో ఈమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే తమిళ బిగ్ బాస్ లో ఈమె గతంలో పాల్గొని ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ కు అవకాశం దక్కించుకుంది.తెలుగు లో కూడా అరుదైన రికార్డు ను బిందు దక్కించుకుంది. తమిళం ఇంకా తెలుగు బిగ్ బాస్ ల్లో కనిపించిన ఈమె ఈసారి తెలుగు బిగ్ బాస్ మొదటి విజేతగా నిలిచే ఛాన్స్ ఉందని కూడా ప్రచారం జోరుగా సాగుతోంది.



ఇక బిందు మాధవికి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ప్రచారం చేస్తూ ఆకట్టుకుంటున్నారు.బిందు మాధవి కి తమిళ యంగ్ హీరో హరీష్ కళ్యాణ్ సపోర్ట్ గా పోస్ట్ పెట్టాడు. బిందు మాధవి తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకోవాలని ఇంకా ఆమెకు ఓట్లు వేయాలంటూ హరీష్ కళ్యాణ్ కోరడంతో ఇద్దరి మద్య ఏం ఉంది అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించిన బిందు మాధవి తెలుగు బిగ్ బాస్ లో ఇప్పుడు నెం.1 గా నిలవడం ఖాయం అంటూ ఆయన చాలా నమ్మకంగా ఉన్నాడు.ఇక బిందు మాధవి కంటే చాలా చిన్నవాడు అయిన ఆ యంగ్ హీరో ఉన్నట్లుండి బిందుకు మాములుగా సపోర్ట్ చేయడం లేదు. ఇద్దరి మద్య చాలా కాలంగానే సన్నిహిత సంబంధాలు అనేవి ఉన్నాయి. వారిద్దరు గతంలో నే సోషల్ మీడియా వేదికగా తమ స్నేహాన్ని కూడా చాటుకున్నారు. ఇప్పుడు వీరిద్దరి మద్య ఉన్నది స్నేహమా లేక మరేదైనానా అంటూ జనాల్లో చర్చ అనేది జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: