ఆమధ్య సినిమా టికెట్ రేట్ల వ్యవహారంలో టికెట్ రేట్లు తగ్గించి ఆడియన్స్ పరువు తీయొద్దంటూ కామెంట్ చేసిన హీరో నాని, మళ్లీ ఇప్పుడు అలాంటి డైలాగే కొట్టారు. యాంకర్ సుమ నటించిన జయమ్మ పంచాయితీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన నాని.. ప్రభుత్వంపై మరోసారి పరోక్షంగా సెటైర్లు పేల్చారు. అంతే కాదు, ఇండస్ట్రీలో పెద్దలు, అసోసియేషన్లకు కూడా చురకలంటించారు. సినిమా ఇండస్ట్రీకి వారేం చేశారో తనకు తెలియదన్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిశ్రమలోని పెద్దలు, అసోసియేషన్లు, ప్రభుత్వాలు ఏం చేశాయో తెలియదు కానీ, సుమ మాత్రం చాలా చేసిందన్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో పలు సినిమా ఫంక్షన్లకు ఆమె గెస్ట్ గా వచ్చారని, ఆమె నవ్వు, పాజిటివ్ ఎనర్జీ సినిమాలకు పాజిటివ్ గా పనిచేసిందని చెప్పుకొచ్చారు నాని.

సుమక్క అనడమే ఇష్టం..
యాంకర్ సుమను సుమ గారూ.. అని పిలవడం అలవాటైందని, కానీ తన మనసులోని మాటను చెప్పాలంటే మాత్రం సుమక్క అనేస్తానన్నారు నాని. ఇక సుమ పూర్తి స్థాయి నిడివిలో నటించిన తొలి సినిమా జయమ్మ పంచాయితీ. ఈ సినిమాకు  విజయ్ కుమార్ కలివరపు దర్శకుడు. కీరవాణి సంగీత దర్శకుడు. జయమ్మ పంచాయితీ మే 6 న రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. నాగార్జున, నాని ముఖ్య అతిధులుగా ఈ కార్యక్రమానికి వచ్చారు. దేవదాసు మూవీలో నాగార్జునతో నాని కలసి నటించారు. ఆ తర్వాత తామిద్దరం ఇప్పుడే కలిశామని, నాగ్ సర్ ని కలవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు నాని.

తొలిసారిగా సుమ క్యాస్టింగ్ ప్లేస్ లో తాను గెస్ట్ ప్లేస్ లో ఉండటం కొత్తగా ఉందని చెప్పారు నాని. తన సొంత కార్యక్రమం ఉన్నా కూడా దాన్ని వాయిదా వేసుకుని సుమ ప్రోగ్రామ్ కి గెస్ట్ గా వచ్చానని చెప్పారు నాని. సుమకు తాను పెద్ద అభిమానిని అని చెప్పారు నాని. తెలుగు సినీ ఇండస్ట్రీలోని పెద్దలు, ఇండస్ట్రీలో ఉన్న అసోసియేషన్ లు, ప్రభుత్వాలు.. సినిమాకు ఏం చేశాయో తెలియదు కానీ, సుమగారు మాత్రం తెలుగు సినిమాకు చాలా చేశారని చెప్పారు నాని. జయమ్మ పంచాయితీ సినిమా బ్లాక్ బస్టర్ కావాలని, ఆ తర్వాత సుమ యాక్టర్ గా బిజీ కావాలని.. ఇకపై సినిమా ఫంక్షన్లలో హోస్ట్ గా ఎక్కడా కనపడకూడదని అన్నారు నాని. నాని పరోక్షంగా ప్రభుత్వాలపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీ పెద్దలు, యూనియన్లని కూడా కలిపి నాని వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: