పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస పెట్టి సినిమాల్లో నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అజ్ఞాతవాసి సినిమా తర్వాత కొంత కాలం పాటు మూవీ లకు గ్యాప్ తీసుకున్న పవన్ కళ్యాణ్ తిరిగి వఖిల్ సబ్ మూవీ తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు.  ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా తర్వాత భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కళ్యాణ్ నటించాడు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకుంది.  ఇలా వరుస విజయాలతో ఫుల్ జోష్ మీద ఉన్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు.  

క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతుంది. ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు'  సినిమా షూటింగ్ లో పాల్గొంటూనే మరో మూవీ ని సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తమిళ్ సినిమా వినోదయ సీతమ్ ను తెలుగు లో రీమేక్ చేయబోతున్నాడు.  ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు సాయి ధరమ్ తేజ్ కూడా ఈ మూవీ లో ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు.  

జూన్ లో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభించి,  రెగ్యులర్ గా ఈ మూవీ షూటింగ్ ని నిర్వహించాలని పవన్ కళ్యాణ్ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.  తమిళ వెర్షన్ కు దర్శకత్వం వహించిన సముద్ర కని ఈ తెలుగు రీమేక్ కి కూడా దర్శకత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ కి ఉన్న ఇమేజ్ దృష్ట్యా ఈ సినిమా కథలో కొన్ని మార్పులు చేర్పులు చేయనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: