బోల్డ్ బ్యూటీ శ్రద్దా దాస్  పైట కొంగు పక్కకు జరిపి నాభి చూపిస్తూ నానా రచ్చ చేస్తుంది.అమ్మడు నాజూకు నడుము అందాలకు జనాల మైండ్ బ్లాక్ అవుతుండగా క్రేజీ కామెంట్స్ కూడా చేస్తున్నారు.అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు టెంప్ట్ చేసే గ్లామర్ మరియు టాలెంట్ ఉండి కూడా శ్రద్దా దాస్ మరుగున పడిపోయారు. ఆవిడకు రావాల్సిన స్థాయిలో గుర్తింపు కూడా రాలేదు. కనీసం ఓ స్థాయి హీరోయిన్ హోదా కూడా దక్కించుకోలేకపోయారు.


 

దాదాపు 13 ఏళ్ల కెరీర్ లో ఒక్కటంటే ఒక్క బ్రేక్ కూడా దక్కలేదు. స్టార్ హీరోల చిత్రాలలో నటించినా, అవి భారీ విజయాలు సాధించినా.. ఆమె చేసిన పాత్రల రీత్యా గుర్తింపు అస్సలు రాలేదు. సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఆర్య 2లో శ్రద్ధ సెకండ్ హీరోయిన్ గా మాత్రమే నటించారు. బన్నీ వెంటపడే సాఫ్ట్ వేర్ అమ్మాయి రోల్ లో  ఆమె మెప్పించారు. 

అలాగే ప్రభాస్ కెరీర్ లో యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా నిలిచిన డార్లింగ్ మూవీలో కూడా శ్రద్దా సెకండ్ హీరోయిన్ గా ఆమె నటించారు.డార్లింగ్ సూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఆర్య 2, డార్లింగ్ చిత్రాల్లో శ్రద్దా చేసిన పాత్రలు సెకండ్ హీరోయిన్ కి తక్కువ, క్యామియోకి ఎక్కువ అన్నట్లు ఉంటుంది..


 

తెలుగులో మొదలైన ఆమె కెరీర్ అన్ని భాషల్లో కూడా కొనసాగింది. తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాలలో నటించినా ఎక్కడా కూడా బ్రేక్ రాలేదు. పేరుకు పదుల సంఖ్యలో చిత్రాలు చేసినా కూడా ఫలితం మాత్రం శూన్యం. అయితే ఖాళీగా లేకుండా చిత్రాలు మాత్రం చేస్తుంది.

 

ప్రస్తుతం శ్రద్దా దాస్ వెబ్ సిరీస్లు, వెబ్ మూవీస్ పై బాగా దృష్టి పెట్టింది. సంతోష్ శోభన్ హీరోగా ఇటీవల విడుదలైన ఓటిటి రిలీజ్ ఏక్ మినీ కథ మూవీలో శ్రద్ధ ఒక బోల్డ్ రోల్ చేశారు. ఆమె పాత్రకు మంచి గుర్తింపు అయితే దక్కింది. ఏక్ మినీ కథ హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.


 

తెలుగులో తెరకెక్కుతున్న అర్థం, నిరీక్షణ చిత్రాలలో ఆమె నటిస్తున్నారు. ఆ మధ్య తెలుగు బిగ్ బాస్ షోలో పాల్గొంటున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి. పలు భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న నాకు బిగ్ బాస్ హౌస్ కి వెళ్లే అవసరం లేదని శ్రద్దా తెగేసి చెప్పడం జరిగిందట.

 

మరోవైపు 30 ప్లస్ లోకి ఎంటరైన ఈ భామ పెళ్లి మాట అస్సలు ఎత్తడం లేదు. వచ్చిన ఆఫర్స్ కాదనకుండా చేసుకుంటూ పోతుందట.. అడపాదడపా అవకాశాలతో ఆమె కెరీర్ ఆగకుండా సాగుతుంది. దీనితో పెళ్లి ఆలోచన పక్కనబెట్టి ఎన్నో ఆశలతో అడుగులు వేస్తుంది.


 

ఆ మధ్య తెలుగు బిగ్ బాస్ షోలో పాల్గొంటున్నారంటూ కూడా వార్తలు వచ్చాయి. పలు భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న నాకు బిగ్ బాస్ హౌస్ కి వెళ్లే అవసరం లేదని శ్రద్దా తెగేసి చెప్పడం జరిగిందట 


 

ఈ అమ్మడు నాజూకు నడుము అందాలకు జనాల మైండ్ బ్లాక్ అవుతుండగా క్రేజీ కామెంట్స్ కూడా చేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: