బాహుబలి చిత్రం విడుదలైన తర్వాత.. సౌత్ సినిమా ఇండస్ట్రీ రేంజ్ అమాంతం పెరిగి పోయిందని చెప్పవచ్చు. ఆ తరువాత కన్నడ చిత్రమైన kgf చిత్రం, పుష్ప చిత్రాలు వరుసగా సౌత్ లో విడుదల అవ్వగానే ఇండియన్ మార్కెట్ డామినేట్ చేయడం స్టార్ట్ చేసినట్లు క్లారిటీ వచ్చింది. ఒక విధంగా చెప్పుకుంటే బాలీవుడ్ పనైపోయింది అనే విధంగా వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే రొటీన్ కమర్షియల్ ఫార్మెట్లను మార్చకపోతే ఇక బాలీవుడ్ లో అగ్ర హీరోలు సైతం మార్కెట్ కూడా చాలా తగ్గిపోతుంది అనే విధంగా పలువురు కామెంట్ చేస్తున్నారు.

అయితే ఇలాంటి విషయంలో ఒక్కొక్కరు ఒక విధంగా స్పందిస్తూ ఉంటే రీసెంట్గా బాలీవుడ్ కు కమర్షియల్ కామెడీ చిత్రాలకు పెట్టిన పేరు డైరెక్టర్ రోహిత్ శెట్టి. సౌత్ నార్త్ సినిమాలు వారిపై కూడా తనదైన శైలిలో వివరణ ఇవ్వడం జరిగింది. ఎన్నో ఏళ్లుగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమ పని అయిపోయింది అన్నట్లుగా కామెంట్లు వినిపిస్తున్నాయి ముఖ్యంగా 1980 కాలంలో ఈ వార్తలు వినిపించాయి అప్పుడు కూడా థియేటర్ లోకి ఎవరు రారు అని అన్నారు. ఇక ఇటీవల ఓ టి టి కంటే ఎక్కువ అయినప్పుడు కూడా అదే తరహాలో కామెంట్స్ చేయడం జరిగింది.

కానీ అవన్నీ అబద్ధాలే అని తేలిపోయింది ప్రేక్షకులు థియేటర్కు వచ్చి సినిమాలను ఒక కొత్త తరహాలో ఎంజాయ్ చేస్తున్నారని.. సౌత్ చిత్రాలు భారీ స్థాయిలో విజయాన్ని అందుకోవడం చాలా సంతోషమని అయితే అంతమాత్రాన బాలీవుడ్ సినిమా పరిశ్రమ పని అయిపోయింది అనడం కరెక్ట్ కాదు. ఒకప్పుడు కమల్ హాసన్ కూడా హిందీ చిత్ర పరిశ్రమలో వరుసగా విజయాలు అందుకున్నవారే. సౌత్ సినిమాలు చాలా వరకు హిందీలో రీమేక్ అవుతునే ఉన్నాయి. ప్రస్తుతం ఆడియన్స్ కూడా అన్ని రకాల సినిమాలను చూస్తున్నారు. ఇది ఒక విధంగా సంతోషించాల్సిన విషయమే.. కానీ బాలీవుడ్ పరిశ్రమని ఇతర పరిశ్రమల తో పోల్చి చూడడం ఒక నెగిటివ్ కామెంట్ చేయడం మంచిది కాదని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: