రక్షణ రంగంలో ఎప్పటికప్పుడు తన సామర్థ్యాన్ని పెంచుకుంటున్న భారత్ ఇప్పుడు ఎగుమతులపైన దృష్టి సారించింది. ఎంతో కీలకమైన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ మిజైల్ని ఫిలిఫ్పైన్స్ కి అప్పగించింది. రెండేళ్ల క్రితం భారత్, ఫిలిఫ్పైన్స్ కి మధ్య జరిగిన ఒప్పందం కుదిరింది. ఈ మిజైల్ కోసం ఫిలిఫ్పైన్స్ 375 మిలియన్ డాలర్లు చెల్లించింది.



ద్వైపాక్షిక రక్షణ సహకారంలో భాగంగా భారత్ మొదటి దశ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులు, లాంచర్లను ఫిలిఫ్పైన్స్ కి సరఫరా  చేసింది. రెండు దేశాల మధ్య జరిగిని ఒప్పందంలో భాగంగగా రెండేళ్ల తర్వాత మొదటి దశ ఎగుమతి జరిగింది. బ్రహ్మెస్ క్షిపణులను ఎగుమతి చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. క్షిపణులు, లాంఛర్లతో కూడిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సీ-17 గ్లోబ్ మాస్టర్ రవాణా విమానం నాగపుర్ నుంచి బయలుదేరి, ఏప్రిల్ 19 ఉదయం వరకు ఫిలిఫ్పీన్స్  రాజధాని మనీలాకు చేరుకుంది.



అయితే ప్రస్తుతం చైనా- ఫిలిఫ్పీన్స్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో బ్రహ్మోస్ క్షిపణులు ఫిలిఫ్పీన్స్ కి చాలా ముఖ్యమైన రక్షణ ఆయుధంగా ఉపయోగపడుతాయి. ఇవి పశ్చిమ ఫిలిఫ్పీన్స్ సముద్రంలో తీర ప్రాంత రక్షణ రెజిమెంట్ సామర్థ్యాలను గణనీయంగా పెంచుతాయి. ఈ ప్రాంతం చైనా వివాదాలకు కేంద్రంగా మారింది. భారత్- రష్యా కలసి అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణి ప్రపంచంలెఓనే అత్యంత వేగవంతమైన సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిగా గుర్తింపు పొందింది.



ఇండో పసిఫిక్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతల మధ్య, బ్రహ్మోస్ ఒప్పందం కీలక రక్షణ భాగస్వామిగా భారత్ స్థాయిని పెంచుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పుడు అదే ఫిలిఫ్పీన్స్ కి తన యుద్ధ నౌకలను అమెరికా పంపించింది. మా ప్రాంతంలో సైనిక విన్యాసాలు సృష్టించి ఆందోళన కలిగించ వద్దని చైనా హెచ్చరిస్తుంటే.. మేం సైనిక చర్యలు కోసం పంపించామని అమెరికా చెబుతోంది. మొత్తం మీద చైనా ఆధిపత్యాన్ని గండి కొట్టేలా మోదీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: