దగ్గుబాటి బాబాయి, అబ్బాయి విక్టరీ వెంకటేష్ రానా కలిసి నటించిన నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ 'రానా నాయుడు'. అమెరికన్ క్రైం డ్రామా సిరీస్ రే డోనోవన్'ఆధారంగా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ కు కరణ్ హాన్షుమాన్ దర్శకత్వం వహించారు. దగ్గుబాటి హీరో లు ఇద్దరూ కలిసి ఒకే ఫ్రేమ్లో కనిపించబోతుండంతో ఈ వెబ్ సిరీస్ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక ఈ వెబ్ సిరీస్ లో రానా ఇల్లీగల్ వ్యవహారాలు చేసేవాడుగా కనిపించనుండగా.. వెంకటేష్ ఒక గ్యాంగ్ స్టర్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక తాజాగా ఈ వెబ్ సిరీస్ షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసుకుంది. ఈ మేరకు చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన చేసింది. 

రానా నాయుడు షూటింగ్ పూర్తయినట్లు నెట్ ఫ్లిక్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ వెబ్ సిరీస్ ప్రకటించినప్పటి నుంచే ఈ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆ అంచనాలను రెట్టింపు చేసింది. ఇక ఈ వెబ్ సిరీస్ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ ఏడాది ద్వితీయార్థంలో విడుదల కాబోతోంది. అది కూడా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇక తాజాగా రానా నాయుడు షూటింగ్ పూర్తిచేసుకున్న సందర్భంగా అందుకు సంబంధించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఈ ఫోటోల్లో వెంకటేష్ రానా ఇద్దరి తో పాటు మిగతా బృందం కూడా ఉన్నారు. ఇక అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారుతున్నాయి.

ఇక ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ నటించిన ఎఫ్ 3 సినిమా తాజాగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటికే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా తర్వాత సితార ఎంటర్టెన్మెంట్స్ సంస్థలో ఓ సినిమా చేయబోతున్నాడు వెంకటేష్. ఇక దగ్గుబాటి రానా ఇటీవలే భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రానా నటించిన విరాటపర్వం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాని ముందుగా జూలై 1న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కానీ తాజా సమాచారం ప్రకారం అంతకంటే ముందే అంటే జూన్ 17న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు సమాచారం...!!

మరింత సమాచారం తెలుసుకోండి: