గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఒకప్పుడూయ్ తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ ఊపు ఊపేసింది. స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఆ తర్వాత ప్రేమ పెళ్లి అంటూ సినిమాలకు దూరం అయ్యింది. ఇప్పుడు మల్లి రీ ఎంట్రీ కోసం తెగ ప్రయత్నాలు చేస్తుంది. దేవదాసు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో ఇలియానా తన నడుమందాలతో తెలుగు యూత్‌కు నిద్ర లేకుండా చేసింది.

దేవదాసు మంచి విజయం అందుకోవడం తో ఆ తర్వాత మహేష్, పూరి కాంబినేషన్‌ లో వచ్చిన ‘పోకిరి’లో నటించి ఒకే సినిమా తో స్టార్ హీరోయిన్‌గా మారింది. ఆ సినిమా ఇచ్చిన ఊపుతో తెలుగు కుర్ర హీరోల సరసన చేస్తూ.. తన అందచందాలతో తెలుగు ఇండస్ట్రీని కొన్నాళ్ళు ఓ ఊపు ఊపింది ఇలియానా. ఓ పక్క ఇటు తెలుగులో నటిస్తూనే.. మరోవైపు హిందీ సినిమాలపై కన్నేసిన ఇలియానా అక్కడ కూడా అదరగొట్టింది. అందులో భాగంగా ఈ భామ అక్కడ 'బర్ఫీ', 'పటా పోస్టర్ నిఖలా హీరో', 'మెయిన్ తెరా హీరో', 'రుస్తుం' లాంటీ సినిమాల్లో నటించి మంచి హిట్‌లు అందుకుంది..

తాజాగా ఇలియానా మరోసారి తన హాట్ నెస్ తో మతిపోగొడుతోంది. తాజాగా ఈ బ్యూటీ స్టైలిష్ వేర్ లో దర్శనమిచ్చింది. ట్రెండీ సూట్ లో స్టైలిష్ లుక్ ను సొంతం చేసుకుంది. జాకెట్ ఓపెన్ చేసి అందాల విందు చేస్తూ మతిపోయేలా ఫొటోలకు ఫోజులిచ్చింది. కుర్రాకారును రెచ్చగొట్టేలా స్టిల్స్ ఇస్తూ నెట్టింట హంగామా క్రియేట్ చేస్తోంది. తాజాగా పిక్స్ ను అభిమానులు, నెటిజన్లు లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు..  ఆమె అందాలను చూసి అయినా సినిమా ఛాన్స్ వస్తే బాగుండు.. నెస్ట్ ఎవరితో చేస్తుందో అని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: