టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ లలో ఒకరైన నిత్యా మీనన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . నిత్యా మీనన్ 2011 వ సంవత్సరంలో విడుదల అయిన అలా మొదలైంది మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది .

మూవీ లో నాని హీరోగా నటించగా నందిని రెడ్డిమూవీ కి దర్శకత్వం వహించింది . ఈ సినిమా మంచి విజయం సాధించడం అలాగే ఈ మూవీ లో నిత్యా మీనన్ అంద చందాలకు , నటనకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు లభించడంతో ఈ ముద్దు గుమ్మకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో వరుస అవకాశాలు దక్కాయి . అందులో భాగంగా అనేక తెలుగు సినిమాల్లో నటించిన నిత్య మీనన్ అనేక విజయాలను కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో అందుకొని ఎన్నో సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కొనసాగింది . ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే నిత్యా మీనన్ , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , దగ్గుబాటి రానా హీరోలుగా తెరకెక్కిన భీమ్లా నాయక్ మూవీ లో పవన్ కళ్యాణ్ కి జోడిగా నటించింది .

ఇది ఇలా ఉంటే తాజాగా నిత్యా మీనన్ మలయాళ స్టార్ హీరోతో ప్రేమలో పడింది అని,  త్వరలోనే వారిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ వార్తలపై తాజాగా నిత్యా మీనన్ స్పందించింది ... తన వివాహం గురించి వచ్చిన వార్తలు ఏ మాత్రం నిజం లేదని చెప్పింది.  అలాగే పెళ్లి వార్తలను నిత్యా మీనన్ తీవ్రంగా ఖండించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: